Sachin Tendulkar : భారత లెజెండరీ ఆటగాడు సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) ఆటకు వీడ్కోలు పలికి 11 ఏండ్లు గడుస్తున్నా.. అతడి ఆకర్షణ మాత్రం ఇసుమంత కూడా తగ్గలేదు. సచిన్ ఎక్కడ కంటపడినా ఫొటోగ్రాఫర్లు తమ కెమెరాలకు పని చెబుతూనే ఉన్నారు. అలాంటిది ఈ దిగ్గజ ఆటగాడు ఫొటోగ్రాఫర్లకు ఊహించని షాకిచ్చాడు. అసలేం జరిగిందంటే..?
తాజాగా బాలీవుడ్ ఫ్యాషన్ డిజైనర్ ఎకా లఖానీ(Eka Lakhani) ఎంగేజ్మెంట్కు సచిన్ కుటుంబసమేతంగా వెళ్లాడు. భార్య అంజలి, కూతురు సారా టెండూల్కర్(Sara Tendulkar)తో కలిసి ఆ వేడుకకు హాజరయ్యాడు. అక్కడ మాస్టర్ బ్లాస్టర్ ఫ్యామిలీతో పాటు కెమెరాలకు ఫోజిచ్చాడు. ఆ తర్వాత ఫొటోగ్రాఫర్లు సారా సోలో ఫొటో తీయాలనుకున్నారు. అయితే.. సచిన్ మాత్రం వాళ్ల ఆశలపై నీళ్లు చల్లాడు. కూతురు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ‘నో’ అని చెప్పాడు.
‘ఇప్పటికైతే ఆమెను వదిలేయండి’ అని అంటూ అక్కడి నుంచి అంజలి, సారాను తీసుకొని లోపలికి వెళ్లాడు. ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో సచిన్ సమయస్ఫూర్తి కి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ‘పిల్లల ప్రైవసీని కాపాడే తండ్రిగా సచిన్ వ్యహరించిన తీరు సూపర్’ అంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.
అంతర్జాతీయ క్రికెట్లో మేటి బ్యాటర్ అయిన సచిన్ పరుగుల వీరుడిగా పేరొందాడు. టెస్టులు, వన్డేల్లో నూరు శతకాలతో తిరుగులేని రికార్డు నెలకొల్పాడు. వన్డేల్లో డబుల్ సెంచరీతో చరిత్ర సృష్టించిన మాస్టర్ బ్లాస్టర్ 2011లో వరల్డ్ కప్ కలను నిజం చేసుకున్నాడు.
అంతర్జాతీయ క్రికెట్లో మేటి బ్యాటర్ అయిన సచిన్ పరుగుల వీరుడిగా పేరొందాడు. టెస్టులు, వన్డేల్లో నూరు శతకాలతో తిరుగులేని రికార్డు నెలకొల్పాడు. వన్డేల్లో డబుల్ సెంచరీతో చరిత్ర సృష్టించిన మాస్టర్ బ్లాస్టర్ 2011లో వరల్డ్ కప్ కలను నిజం చేసుకున్నాడు. సొంతగడ్డపై ప్రపంచ కప్ ట్రోఫీని అందుకున్న సచిన్.. 2013లో ఇంటర్నేషనల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.
అనంతరం ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ (Mumbai Indians) తరఫున విధ్వంసక ఇన్నింగ్స్‌లు ఆడాడు. ప్రస్తుతం అదే ఫ్రాంచైజీకి సచిన్ మెంటార్‌గా సేవలందిస్తున్నాడు. అతడి కుమారుడు అర్జున్ టెండూల్కర్ సైతం ముంబై జట్టుకే ఆడుతుండడం విశేషం.