PM Modi: పోలాండ్, ఉక్రెయిన్ వెళ్తున్నా : ప్రధాని మోదీ
Prime Minister Modi: పోలాండ్, ఉక్రెయిన్ దేశాల పర్యటనకు ప్రధాని మోదీ వెళ్తున్నారు. ఇవాళ ఆయన వార్సా వెళ్లేందుకు విమానం ఎక్కారు. పోలాండ్‌తో దౌత్య సంబంధాలకు 70 ఏళ్లు నిండాయని ప్రధాని మోదీ తెలిపారు.
న్యూఢిల్లీ: పోలాండ్, ఉక్రెయిన్ దేశాల పర్యటనకు ప్రధాని మోదీ(PM Modi) వెళ్తున్నారు. ఇవాళ ఆయన వార్సా వెళ్లేందుకు విమానం ఎక్కారు. పోలాండ్‌తో దౌత్య సంబంధాలకు 70 ఏళ్లు నిండాయని ప్రధాని మోదీ తెలిపారు. సెంట్రల్ యూరోప్‌లో పోలాండ్ కీలకమైన ఆర్థిక భాగస్వామి అని ఆయన పేర్కొన్నారు. ప్రజాస్వామ్యం, బహుళత్వానికి రెండు దేశాలు కట్టుబడి ఉన్నాయని, ఇది రెండు దేశాల బంధాన్ని బలోపేతం చేస్తున్నట్లు ప్రధాని వెల్లడించారు. రెండు దేశాల పర్యటనకు ముందు ఆయన ఓ ప్రకటన జారీ చేశారు.
పోలాండ్ ప్రధాని డోనాల్డ్ టస్క్, అధ్యక్షుడు ఆండ్రేజ్ దుడాతో భేటీకానున్నట్లు ప్రధాని మోదీ వెల్లడించారు. పోలాండ్‌లో ఉన్న భారతీయ కమ్యూనిటీని కలవనున్నట్లు చెప్పారు. అక్కడ నుంచి ఉక్రెయిన్‌కు వెళ్లనున్నట్లు మోదీ తెలిపారు. దేశాధ్యక్షుడు జెలెన్స్కీ ఆహ్వానం మేరకు ఉక్రెయిన్ వెళ్తున్నట్లు చెప్పారు. భారతీయ ప్రధాని ఉక్రెయిన్‌కు వెళ్లడం ఇదే మొదటిసారి. ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసేందుకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోనున్నట్లు ఆయన చెప్పారు.ఉక్రెయిన్‌లో త్వరగా శాంతి, స్థిరత్వం రావాలని ఆశిస్తున్నట్లు చెప్పారు.
Leaving for Warsaw. This visit to Poland comes at a special time- when we are marking 70 years of diplomatic ties between our nations. India cherishes the deep rooted friendship with Poland. This is further cemented by a commitment to democracy and pluralism.
I will hold talks…
— Narendra Modi (@narendramodi) August 21, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MVSR College | హైదరాబాద్ ఎంవీఎస్ఆర్ కాలేజీ దుర్ఘటన.. విద్యార్థిని మృతి కేసులో ముగ్గురు అరెస్ట్
Rahul Gandhi | రాహుల్ గాంధీ అమెరికన్ ఎత్తుగడలు.. సీజేపీపై ఆయన వ్యూహం ఎందుకు ఫలించడం లేదు!
Vegetable Nutrition | కూరగాయలు తింటున్నా పోషకాలు అందడం లేదా? ఈ వంటింటి చిట్కాలు తెలుసుకోండి!
Section 22A | సెక్షన్ 22ఏ జాబితా నుంచి తొలగించినా.. ఆస్తులు కొనేందుకు వెనుకడుగు వేస్తున్న ప్రజలు!
India vs Zimbabwe | హర్మన్‌ప్రీత్ విధ్వంసం.. షఫాలీ సునామీ.. జింబాబ్వే సిరీస్ క్లీన్‌స్వీప్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

