Jennifer Lopez: విడాకులకు దరఖాస్తు చేసుకున్న జెన్నిఫర్ లోపేజ్
Jennifer Lopez: హాలీవుడ్ నటుడు బెన్ అఫ్లెక్ నుంచి విడాకులు తీసుకునేందుకు జెన్నిఫర్ లోపేజ్ దరఖాస్తు చేసుకున్నది. రెండు ఏళ్ల వివాహ బంధానికి ఆ ఇద్దరూ బ్రేకప్ చెప్పేస్తున్నారు. లాస్ ఏంజిల్స్ కౌంటీ కోర్టులో మంగళవారం జెన్నిఫర్ లోపేజ్ డైవర్స్ ఫైల్ చేసింది.
న్యూఢిల్లీ: హాలీవుడ్ నటుడు బెన్ అఫ్లెక్ నుంచి విడాకులు తీసుకునేందుకు జెన్నిఫర్ లోపేజ్(Jennifer Lopez) దరఖాస్తు చేసుకున్నది. రెండు ఏళ్ల వివాహ బంధానికి ఆ ఇద్దరూ బ్రేకప్ చెప్పేస్తున్నారు. లాస్ ఏంజిల్స్ కౌంటీ కోర్టులో మంగళవారం జెన్నిఫర్ లోపేజ్ డైవర్స్ ఫైల్ చేసింది. 2022లో ఆ ఇద్దరూ లాస్ వెగాస్‌లో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత జార్జియాలో భారీ విందును ఏర్పాటు చేశారు. వాస్తవానికి ఇద్దరి మధ్య 2002లోనే పరిచయం జరిగింది. ఆ సమయంలో ఒక్కటవ్వాలని నిర్ణయించారు. కానీ రెండు దశాబ్ధాల తర్వాత వాళ్లు పెళ్లి చేసుకున్నారు.
లాస్ ఏంజిల్స్ కోర్టు డాక్యుమెంట్ల ప్రకారం.. లోపేజ్, అఫ్లెక్ ఇద్దరూ తమ ఆర్థిక సమాచారాన్ని వెల్లడించాల్సి ఉంటుంది. ప్రస్తుత ఆదాయం, ఖర్చులు, ప్రాపర్టీలు, రుణాలు.. ఏమున్నాయో చెప్పాల్సి ఉంటుంది. తుది ఒప్పందం జరిగే వరకు ఇద్దరూ తమ ఆర్థిక వివరాలను బహిర్గతం చేయాల్సి ఉంటుందని కోర్టు డాక్యుమెంట్లు పేర్కొన్నాయి. 60 రోజుల్లో లోపేజ్ తన ఆదాయ, ఆర్థిక వివరాలను వెల్లడించాలి. ఆ తర్వాత మరో 60 రోజుల్లో అఫ్లెక్ కూడా తన ఆర్థిక వివరాలు తెలుపాల్సి ఉంటుంది. ఒకవేళ తమ ఆర్థిక వివరాలు తెలుపకపోతే, అప్పుడు కోర్టు ఈ కేసులో జోక్యం చేసుకుంటుంది.
గత కొన్ని నెలల నుంచి ఆ ఇద్దరి మధ్య రిలేషన్ సరిగాలేదు. పాప్ స్టార్ జెన్నిఫర్ లోపేజ్.. భారీ స్థాయిలో భరణం డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. నటుడు బెన్ అఫ్లెక్‌కు చెందిన 150 మిలియన్ల డాలర్ల ఆస్తిలో.. సగం వాటా కావాలని జెన్నిఫర్ డిమాండ్ చేయనున్నట్లు స్పష్టమవుతోంది. రేడార్ ఆన్లైన్ అనే వెబ్‌పోర్టల్ దీనికి సంబంధించిన కథనాన్ని ఇటీవల రాసింది.
నిజానికి జెన్నిఫర్ లోపేజ్ ఆస్తి సుమారు 400 మిలియన్ల డాలర్లుపైనే ఉంటుంది. అయితే ఈ ఇద్దరూ ఒక్కటైన తర్వాత .. జెన్నిఫర్ భారీ స్థాయిలో ఖర్చు చేసింది. ఇప్పుడు ఆ ఖర్చు మొత్తం బెన్ అఫ్లెక్ నుంచి లాగేయాలని ఆమె చూస్తోంది. జెన్నిఫర్ లోపేజ్ కన్నా ముందు.. జెన్నిఫర్ గార్నర్‌ను బెన్ అఫ్లెక్ పెళ్లి చేసుకున్నాడు. ఆ జంటకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. గతంలో మార్క్ ఆంథోనీతో జరిగిన పెళ్లి వల్ల.. జెన్నిఫర్ లోపేజ్ కవలలకు జన్మనిచ్చింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

