గురువారం 02 ఏప్రిల్ 2020
Sports - Mar 09, 2020 , 17:39:10

నాకంటే నువ్వే హైట్‌ రా బుడ్డోడా...ఫన్నీ వీడియో

నాకంటే నువ్వే హైట్‌ రా బుడ్డోడా...ఫన్నీ వీడియో

ఈ ఫొటోలో బుడ్డోడితో సచిన్‌ ఫోజు చూస్తే ఏమర్థవుతుంది?... నాకంటే నువ్వే హైట్‌రా బుడ్డోడా అని వాడితో మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ చెబుతన్నట్లు ఉంది గదూ.. ఇంతకీ ఈ లిటిల్‌గాడు ఎవరనుకుంటున్నారా?.. క్రికెటర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ కుమారుడు ఇమ్రాన్‌. క్రికెట్‌ దిగ్గజం సచిన్‌తో ఇమ్రాన్‌ కాసేపు సరదాగా ఆడుకున్న వీడియోను ఇర్ఫాన్‌ ట్విట్టర్‌లో పోస్టు చేశాడు. "ఇమ్రాన్‌ ఏంచేశాడో వాడికి తెలీదు. పెద్దయ్యాక ఖచ్చితంగా బాక్సర్‌ అవుతాడు. సచిన్‌తోనే బాక్సింగ్‌ చేశాడు." అని ఇర్ఫాన్‌ కామెంట్‌ చేశాడు. ఈ వీడియోను చూసిన సచిన్‌ కూడా రీ ట్వీట్‌ చేశాడు. చిన్నారులతో  సమయాన్ని గడపడం ఆనందంగా ఉంటుంది. ఇమ్రాన్‌.. నీకండలు  నాకన్నా, మీ నాన్నకన్నా దృడంగా, పెద్దగా ఉంటాయి" అని సచిన్‌ కామెంట్‌ చేశాడు. 

రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించడంలో భాగంగా మహారాష్ట్ర అధికారులు నిర్వహిస్తున్న రోడ్‌సేఫ్టీ సీరిస్‌ టి20 టోర్నీలో ఇర్ఫాన్‌ పఠాన్‌, సచిన్‌ ఆడుతున్నారు.  సచిన్‌తో ఇర్ఫాన్‌ పఠాన్‌ కొడుకు ఫన్నీ వీడియోను మీరూ చూడండి...logo
>>>>>>