Sachin Tendulkar | క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ (Sachin Tendulkar)కు కార్లంటే ఎంత ఇష్టమో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే అతడి వద్ద ఎన్నో విలాసవంతమైన కార్లు ఉన్నాయి. తాజాగా మరో లగ్జరీ కారు సచిన్ గ్యారేజీలోకి వచ్చి చేరింది. లేటెస్ట్ టాప్ వేరియంట్ మోడల్ లాంబోర్ఘిని ఉరుస్ ఎస్ (Lamborghini Urus S) లగ్జరీ కారును సచిన్ కొనుగోలు చేశాడు. లంబోర్ఘిని ఉరుస్ ఎస్ ఎక్స్-షోరూమ్ ధర రూ 4.18 కోట్లగా ఉంది.
కాగా, సచిన్ తన కొత్త లాంబోర్ఘిని కారులో ముంబై రహదారులపై చక్కర్లు కొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియోను సీఎస్ 12 వోల్గ్స్ అనే యూట్యూబ్ సంస్థ షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. సచిన్ 2012 నుండి ప్రముఖ కార్ల సంస్థ బీఎండబ్ల్యూకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటున్న విషయం తెలిసిందే. దీంతో సచిన్ వద్ద ఎక్కువగా బీఎండబ్ల్యూ కార్ల కలెక్షనే ఉంటుంది. బీఎండబ్ల్యూ 7 సిరీస్, బీఎండబ్ల్యూ ఎక్స్5 ఎమ్, బీఎండబ్ల్యూ ఐ8, బీఎండబ్ల్యూ 5 సిరీస్ వంటి లగ్జరీ కార్లు ఉన్నాయి.
Also Read..
Hyderabad | ఎల్బీ నగర్లో విషాదం.. కారు డ్రైవర్ నిర్లక్ష్యంతో రెండేళ్ల చిన్నారి మృతి
CM KCR | విద్యుత్తు సరఫరాలో తెలంగాణ కీర్తి.. పవర్ హాలిడేలే లేవు : సీఎం కేసీఆర్
Nisha Upadhyay | లైవ్‌షోలో ప్రముఖ సింగర్‌పై కాల్పులు.. తీవ్రంగా గాయపడిన గాయని