సెంచూరియన్ : పాకిస్థాన్‌తో ఇక్కడ జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికాకు స్వల్ప ఆధిక్యం సాధించింది. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో పాకిస్థాన్ 211 పరుగులకు కుప్పకూలగా సౌతాఫ్రికా 301 పరుగులకు ఆలౌట్ అవడంతో మొదటి ఇన్నింగ్స్‌లో సఫారీలు 90 పరుగుల ఆధిక్యం దక్కించుకున్నారు. సౌతాఫ్రికా తరఫున మార్క్మ్ (89), బోష్ (81) రాణించారు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన పాక్.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 22 ఓవర్లలో 88/3 పరుగులు చేసింది. బాబర్ ఆజమ్ (16 నాటౌట్), సౌద్ షకీల్ (8 నాటౌట్) క్రీజులో ఉన్నారు.