Wimbledon : వింబుల్డన్‌లో ఫేవరెట్లకు వరుసగా షాక్‌లు తగులుతున్నాయి. మహిళల సింగిల్స్‌లో నవొమి ఒసాకా (Naomi Osaka) అనూహ్యంగా మూడో రౌండ్లోనే వెనుదిరిగింది. మూడేళ్ల తర్వాత వింబుల్డన్ ఆడుతున్న ఈ మాజీ వరల్డ్ నంబర్ 1కు అనస్టాసియా పవ్లిచెంకోవా(రష్యా) షాకిచ్చింది. మూడు సెట్లపాటు హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో ఒసాకా తొలి సెట్ గెలుపొందినప్పటికీ అదే జోరు చూపలేకపోయింది. రెండో సెట్లో పుంజుకున్న అనస్టాసియా విజేతగా నిలిచింది. దాంతో ఉసూరుమంటూ నిష్క్రమించింది ఆసియా టెన్నిస్ స్టార్.
నాలుగు గ్రాండ్‌స్లామ్స్ విజేత ఒసాకా వింబుల్డన్‌లో మూడో రౌండ్ దాటలేకపోయింది. 53వ ర్యాంకర్ అనస్టాసియా ధాటికి నిలువలేకపోయింది. తొలి సెట్‌ను ఒసాకా 3-6తో సులువుగా గెలుపొందింది. ఆ తర్వాత అనస్టాసియా తన అసలైన గేమ్‌తో విరుచుకుపడి 6-4, 6-4తో రెండు సెట్లలో పైచేయి సాధించింది. తదుపరి రౌండ్లోనూ ఇదే ఉత్సాహంతో చెలరేగాలని భావిస్తున్నట్టు చెప్పిందీ 2021లో ఫ్రెంచ్ ఓపెన్ రన్నరప్ అయిన రష్యా క్రీడాకారిణి. తొమ్మిదేళ్లలో అనస్టాసియా నాలుగో రౌండ్‌కు చేరడం ఇదే తొలిసారి.
Into 4R for the first time in nine years 🤝
Anastasia Pavlyuchenkova comes from a set down to defeat Naomi Osaka 3-6, 6-4, 6-4 on No.2 Court 💥#Wimbledon pic.twitter.com/0ZwgDsYVc5
— Wimbledon (@Wimbledon) July 4, 2025
‘నేను కచ్చితంగా గెలుస్తానని అనుకున్నా. కానీ, అనస్టాసియా అద్భుతంగా ఆడింది. నేను మరింత మెరుగవ్వాలి. వింబుల్డన్‌లో ముందడుగు వేసేందుకు నేను చాలా కష్టపడ్డాను. కానీ, రెండుసెట్లలో అత్యుత్తమంగా ఆడలేకపోయాను అని మ్యాచ్ అనంతరం చెప్పింది. గతంలో యూఎస్ ఓపెన్, రెండుసార్లు ఆస్ట్రేలియా ఓపెన్‌లో ఛాంపియన్ అయిన ఒసాకా పునరాగమనం తర్వాత నిరాశపరుస్తోంది. గాయం నుంచి కోలుకొని ఈ ఏడాది ఆల్ ఇంగ్లండ్ క్లబ్ టోర్నీతో ఎంట్రీ ఇచ్చిన ఆమె.. వరుసగా మూడు మ్యాచుల్లో ఓడిపోయింది.