Madelayya Swami | కాల్వశ్రీరాంపూర్, జూలై 4 : రజకుల ఆరాధ్య దైవమై న మడేలయ్య స్వామి ఆశీస్సులతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని కాల్వశ్రీరాంపూర్ మాజీ జడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి అన్నారు. మండలంలోని పందిళ్ల గ్రామంలో రజకులు శుక్రవారం మడేలయ్య బోనాల జాతర నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు బోనాలు ఎత్తుకొని డప్పు చప్పులతో శివశక్తుల నృత్యాలతో పురవీధుల గుండా స్వామి ఆలయానికి చేరుకుని మొక్కులు సమర్పించుకున్నారు.
ఈ బోనాల వేడుకల్లో కాల్వ శ్రీరాంపూర్ మాజీ జడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డితో పాటు మాజీ సర్పంచ్ ఆడెపు శ్రీదేవి రాజు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. స్వామి ఆశీస్సులతో మండల ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని పాడి పంటలు సక్రమంగా పండి వర్షాలు సమృద్ధిగా పండాలని స్వామి వారిని వేడుకున్నట్లు తెలిపారు.