Andre Russel : అంతర్జాతీయ క్రికెట్లో విధ్వంసక ఆటగాళ్లలో ఒకడైన ఆండ్రీ రస్సెల్ (Andre Russel) వీడ్కోలుతో అందర్నీ ఆశ్చర్యపరిచాడు. పొట్టి క్రికెట్ స్పెషలిస్ట్‌గా ముద్ర పడిన రస్సెల్ టీ20 వరల్డ్ కప్ టోర్నీకి ఏడు నెలల ముందే అల్విదా పలికి కరీబియన్ జట్టుకు ఝలక్ ఇచ్చాడు. ఆస్ట్రేలియాతో సిరీస్ మధ్యలోనే మూడు ఫార్మాట్ల నుంచి వైదొలగుతున్నట్టు రసెల్ ప్రకటించడంతో అతడి రికార్డులపై ఓ లుక్కేస్తున్నారు అభిమానులు. ఈ కరీబియన్ స్టార్ కూడా ఫ్యాన్స్‌కు తెలియని పలు విషయాలను పంచుకుంటున్నాడు. శనివారం ఈ చిచ్చరపిడుగు తన సుదీర్ఘ జర్నీలోని ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.
పొట్టి ప్రపంచ కప్(2016)లో టీమిండియాపై విజయాన్ని తన కెరీర్లో మర్చిపోలేనని అంటున్నాడీ ఆల్‌రౌండర్. ‘అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాక నీ అత్యుత్తమ ఇన్నింగ్స్ ఏది?, నీ కెరీర్లో ఉత్తమ క్షణాలు ఏంటీ? అని చాలామంది అడుగుతున్నారు. నా వరకైతే 2016 పొట్టి వరల్డ్ కప్‌లో టీమిండియాపై ఆడిన ఇన్నింగ్సే అత్యుత్తమం. భారత్‌పై చిరస్మరణీయ విజయమే నా కెరీర్లో అద్భుతమైన క్షణం.
190 పరుగుల ఛేదనకు దిగిన మాకు ప్రేక్షకుల మద్దతు లభించలేదు. అందరూ భారత్‌నే సపోర్ట్ చేస్తున్నారు. దాంతో, కొంచెం ఒత్తిడిగా అనిపించింది. కానీ, ఆ మ్యాచ్‌లో లెండిల్ సిమన్స్(82 నాటౌట్)తో కలిసి మా టీమ్‌ను విజయతీరాలకు చేర్చాను. ఓపెనర్లు, మిడిలార్డర్ కూడా రాణించడం.. నేను, సిమన్స్ చెలరేగడంతో మా జట్టు రెండోసారి పొట్టి కప్‌ను ముద్దాడింది’ అని తమ దేశ బోర్డు ఇంటర్వ్యూలో వివరించాడు రస్సెల్.
🏏 Cricket West Indies salutes Andre Russell as he bids farewell to international cricket.
A true game-changer and T20 icon. Thank you, Dre Russ! 🙌https://t.co/H8kcLCngQv#AndreRussell #CWI #WestIndiesCricket #FarewellLegend pic.twitter.com/LwReEfJxay— Cricket World (@Cricket_World) July 17, 2025
వెస్టిండీస్ జట్టు రెండుసార్లు పొట్టి ప్రపంచకప్ ఛాంపియన్‌గా నిలవడంలో రస్సెల్‌ది కీలక పాత్ర. బ్యాటుతో, బంతితో విశేషంగా రాణించిన అతడు విండీస్ జగజ్జేతగా అవరించేలా చేశాడు. ముఖ్యంగా 2016 ఎడిషన్ సెమీ ఫైనల్లో అతడి విధ్వంసకకాండను భారత అభిమానులు మర్చిపోలేరు. ఆ మ్యాచ్‌లో 42 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును గెలిపించాడీ డాషింగ్ బ్యాటర్. అందుకే ఆ ఇన్నింగ్స్, ఆ విజయం తనకు మరపురానిది అని వెల్లడించాడు రస్సెల్. ప్రమాదకర ఆటగాడిగా పేరొందిన విండీస్ స్టార్ జమైకా టీ20 లీగ్‌తో మూడు ఫార్మాట్ల నుంచి వైదొలగనున్నాడు.