ప్లే ఆఫ్స్ బెర్తు ఖాయం చేసుకునేందుకు రాజస్థాన్ రాయల్స్.. ప్లేఆఫ్ రేసులో ఆశలు సజీవంగా ఉంచుకునేందుకు ఢిల్లీ క్యాపిటల్స్ తలపడేందుకు సిద్ధమయ్యాయి. ముంబైలోని డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో ఢిల్లీ సారధి రిషభ్ పంత్ టాస్ గెలిచాడు. తాము ముందుగా బౌలింగ్ చేస్తామని చెప్పాడు.
రిపాల్ పటేల్ స్థానంలో లలిత్ యాదవ్, ఖలీల్ అహ్మద్ స్థానంలో చేతన్ సకారియా ఆడతారని వెల్లడించాడు. అలాగే రాజస్థాన్ జట్టులో షిమ్రాన్ హెట్మెయర్ స్థానంలో రాసీ వాన్ డర్ డస్సెన్ ఆడుతున్నట్లు సంజూ శాంసన్ తెలిపాడు.
రాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్ (కెప్టెన్), దేవదత్ పడిక్కల్, రాసీ వాన్ డర్ డస్సెన్, రియాన్ పరాగ్, అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, ప్రసిద్ధ్ కృష్ణ, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ సేన్
ఢిల్లీ క్యాపిటల్స్: డేవిడ్ వార్నర్, కేఎస్ భరత్, మిచెల్ మార్ష్, రిషభ్ పంత్ (కెప్టెన్), రావ్మెన్ పావెల్, లలిత్ యాదవ్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, ఆన్రిచ్ నోర్ట్జీ, చేతన్ సకారియా
A look at the Playing XI for #RRvDC
Live – https://t.co/EA3RTz0tWQ #RRvDC #TATAIPL https://t.co/urbjTtm6xL pic.twitter.com/0K0k8rO07v
— IndianPremierLeague (@IPL) May 11, 2022