ENG vs AUS | మాంచెస్టర్: మిడిలార్డర్ బ్యాటర్ మార్నస్ లబుషేన్ (111) సెంచరీ బాదడంతో ఇంగ్లండ్తో జరుగుతున్న యాషెస్ నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా పోరాడుతున్నది. ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో 317 పరుగులు చేయగా.. ఇంగ్లండ్ 592 రన్స్ కొట్టింది. శనివారం నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్లో 5 వికెట్లు కోల్పోయి 214 పరుగులు చేసింది.
వర్షం కారణంగా ఆగుతూ సాగుతున్న ఈ మ్యాచ్లో చేతిలో 5 వికెట్లు ఉన్న ఆసీస్.. ప్రత్యర్థి స్కోరుకు ఇంకా 61 పరుగులు వెనుకబడి ఉంది. మిషెల్ మార్ష్ (31),గ్రీన్ (3) క్రీజులో ఉన్నారు. ఇంగ్లండ్ బౌలర్లలో మార్క్ వుడ్ మూడు వికెట్లు పడగొట్టాడు.