Ashes Series : ఎడ్జ్‌బాస్టన్ స్టేడియం వేదికగా జరుగుతున్న యాషెస్ తొలి టెస్టులో ఇంగ్లండ్ ఆలౌట్ ప్రమాదంలో పడింది. ఆసీస్ ప్రధాన స్పిన్నర్ నాథన్ లియాన్(Nathan Lyon) 4 వికెట్లు తీసి ఇంగ్లండ్‌ను దెబ్బకొట్టాడు. అయితే.. ఆర్ధ శతకం బాదిన జో రూట్(91) ఒంటరి పోరాటం చేస్తున్నాడు. జానీ బెయిర్‌స్టో(78) ఔటయ్యాక వచ్చిన మోయిన్ అలీ(18)ని లియాన్ వెనక్కి పంపాడు. దాంతో, ఇంగ్లండ్ 7వ వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం స్టువార్ట్ బ్రాడ్(9) క్రీజులో ఉన్నాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ స్కోర్… 341/7.
ఒకదశలో 176 పరుగులకే కీలకమైన 5 వికెట్లు కోల్పోయి ఇంగ్లండ్ కష్టాల్లో పడింది. అయితే.. అనుభవజ్ఞులైన రూట్, బెయిర్‌స్టో అదుకున్నారు. మూడో సెషన్లో అటాకింగ్ గేమ్‌తో బెయిర్‌స్టో హాఫ్ సెంచరీ సాధించాడు. దూకుడుగా ఆడే క్రమంలో అతను లియాన్ ఓవర్లో ఔటయ్యాడు.
That’s our Jonny 💪
Live clips/Scorecard: https://t.co/TZMO0eJ5Hq@jbairstow21 🏴 #ENGvAUS 🇦🇺 pic.twitter.com/8CmZfRYdED
— England Cricket (@englandcricket) June 16, 2023
టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ బ్యాటింగ్ తీసుకున్నాడు. ఓపెనర్ బెన్ డకెట్(12), జాక్ క్రాలే(61) ఇన్నింగ్స్‌ను ధాటిగా ఆరంభించారు. కానీ, హేజిల్‌వుడ్ ఓవర్లో కీపర్ అలెక్స్ క్యారీ చేతికి చిక్కాడు. ఆ తర్వాత ఓలీ పోప్(31)తో కలిసి క్రాలే స్కోర్ వేగం పెంచాడు. హాఫ్ సెంచరీ కొట్టిన క్రాలేని బోలాండ్ పెవిలియన్ పంపాడు. అక్కడి నుంచి ఆతిథ్య జట్టు వికెట్ల పతనం మొదలైది. హ్యారీ బ్రూక్(32)ను లియాన్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ బెన్ స్టోక్స్(1) ఇలా వచ్చి అలా వెళ్లాడు. దాంతో, 176 పరుగులకే కీలకమైన 5 వికెట్లు పడ్డాయి.