యేష నాగుల కట్టమీద ఉర్రూతలూగిన పాట
ప్రతి భర్త విజయం వెనుక భార్య ఉంటుందంటారు కదా. నా పాటల ప్రస్థానంలో మాత్రం మా ఆయన సందీప్‌కుమార్ ప్రోత్సాహముంది. ఎవరెన్ని మాటలన్నా పట్టించుకోకుండా నాకు నచ్చిన పని చేయమని తోడుగా నిలిచాడు. రంగారెడ్డి జిల్లాలోని యాచారంలో నేను పుట్టిపెరిగాను. అమ్మానాన్నలిద్దరూ కౌలుకు పొలం తీసుకొని వ్యవసాయం చేసుకుంటూ ఖాళీ సమయాల్లో కూలీపనులు చేస్తుండేవారు.
‘సిటాపటా సినుకులకు’ అనే ఆలుమొగల పాటైనా, ‘రాను బొంబాయికి రాను’అంటూ యువతీ యువకులు పాడుకునే ప్రేమ పాటైనా, ‘జోగురాలు జోగురాలనీ’ అంటూ జోగు చెప్పే ఎల్లమ్మ భక్తి గీతమైనా.. ఆమె స్వరంలో భలేగా కుదురుతాయి. తను ఏ పాట పాడినా యూట్యూబ్‌లో మిలియన్ వ్యూస్ కొల్లగొట్టాల్సిందే! పల్లెపాటలతో మొదలైన ప్రభావతి బంగారిగల్ల గళ విన్యాసం వెండితెర పైనా వెలుగులీనుతున్నది. పాన్ ఇండియా సినిమా ‘ది ప్యారడైజ్’లో ప్రభావతి ఎత్తుకున్న ‘యేష నాగుల కట్టమీద’ ఇప్పుడు అందర్నీ ఉర్రూతలూగిస్తున్నది. ఈ సందర్భంగా సింగర్ ప్రభావతి పంచుకున్న అనుభవాలు ఆమె మాటల్లోనే..
ప్రతి భర్త విజయం వెనుక భార్య ఉంటుందంటారు కదా. నా పాటల ప్రస్థానంలో మాత్రం మా ఆయన సందీప్‌కుమార్ ప్రోత్సాహముంది. ఎవరెన్ని మాటలన్నా పట్టించుకోకుండా నాకు నచ్చిన పని చేయమని తోడుగా నిలిచాడు. రంగారెడ్డి జిల్లాలోని యాచారంలో నేను పుట్టిపెరిగాను. అమ్మానాన్నలిద్దరూ కౌలుకు పొలం తీసుకొని వ్యవసాయం చేసుకుంటూ ఖాళీ సమయాల్లో కూలీపనులు చేస్తుండేవారు. మా అమ్మ ఇంట్లో పనులు చేసుకుంటూ జానపదాలు పాడుతుంటే విని నేర్చుకునేదాన్ని. ఇక చిన్నప్పటినుంచి బతుకమ్మ పాటలు, జానపదాలు పాడుకుంటూనే పెరిగాను. పాఠశాలలో ఏ కార్యక్రమమైనా నేను పాట పాడాల్సిందే. ఆ సమయంలోనే తెలంగాణ ఉద్యమం మొదలైంది. ఊర్లో నిర్వహించే ధూంధాం కార్యక్రమాల్లో పాటలను విని స్కూల్లో పాడేదాన్ని. గొంతు బాగుందని మా సార్లు మస్తు మెచ్చుకునేటోళ్లు. డిగ్రీ వరకు చదువుకున్న నేను సందీప్‌ను ప్రేమ వివాహం చేసుకున్నాను. పెండ్లి తర్వాత పాటలు పాడుకుంటూ ఇంట్లో పనులు చేసుకునేదాన్ని. ఓసారి మా ఆయన నా స్వరం విని నీతో స్టూడియోలో పాడిస్తానని మాటిచ్చాడు. నేనేదో సరదాగా అంటున్నాడేమో అని అనుకున్నా! కానీ, అవకాశాల కోసం చాలామందిని సంప్రదించాడు. అలా 2020లో గజ్వేల్ వేణన్న స్టూడియోలో నా మొదటి పాట ‘సిటాపటా సినుకులకు’ అంటూ నా పాటల ప్రయాణాన్ని ప్రారంభించాను.
అవి ప్రత్యేకం
ఆ పాట పాడుతున్న సమయంలో నేను గర్భవతిని. స్టూడియోలో మైక్ ముందు కాస్త భయపడినా రెండో టేక్‌లోనే పాట పాడాను. నా మొదటి పాటకు ఓ ప్రత్యేకత ఉంది. ఆ పాట లిరిక్స్, సింగర్, యాక్టర్ కూడా నేనే కావడం మరో విశేషం. ఈ పాట షూటింగ్ గజ్వేల్ సమీపంలోని తిమ్మారెడ్డిపల్లి గ్రామంలో జరిగింది. మానుకోట ప్రసాదన్న కో యాక్టర్ అని తెలిసి ఆయన అప్పటికే ఫేమ్‌లో ఉన్న నటుడని కాస్త భయపడ్డాను. షూటింగ్లో భాగంగా వానలో ఈ పాట షూట్ చేస్తుంటే ఆ ఊర్లోని ఆడవాళ్లు నేను కడుపుతో ఉన్నానని జాగ్రత్తలు చెప్పారు. ఓ పెద్దామే జలుబు రాకుండా తువ్వాలతోని నా నెత్తి తుడిచింది. ఇక పాట ఆ టైంలోనే మిలియన్ల వ్యూస్‌ను దక్కించుకుంది. ఇప్పటి వరకు సుమారు 2000కు పైగా పాటలు పాడుంటాను. అందులో ఒక 60 పాటలు నేను సేకరించినవి కాగా, మరో 20 పాటలు రాసి పాడాను. ఓ పది పాటల్లో యాక్టింగ్ కూడా చేశాను. నేను పాడిన పాటల్లో చాలావరకు నాకు ఎంతో గుర్తింపునిచ్చాయి. వాటిలో ముఖ్యంగా..‘సిటాపటా సినుకులకు, కోమటోళ్ల ఓ ఎంకటి, మంచ దిగు మంచ దిగు, రాను బొంబాయికి రాను, నీ మెడలా నా మెడలా నిమ్మల దండ, ఓ పిలగా ఎంకటి’ ఎక్కువ మందిని చేరాయి. ఒక్కో మ్యూజిక్ డైరెక్టర్ వాళ్ల ైస్టెల్కు తగ్గట్టుగా పాటలు పాడించి నా గొంతును నాకే కొత్తగా పరిచయం చేశారు. రౌద్రం, లాలిపాట, ఫోక్, భక్తి ఇలా రకరకాల పాటలు పాడాను. ప్రారంభంలో రెండు రోజులకో పాట పాడిన నేను ప్రస్తుతం ఒక్కరోజులో 12 పాటలు పాడుతున్నందుకు చాలా సంతోషమనిపిస్తుంది.

ఇది పెద్ద హిట్
నేను నా టాలెంట్‌ను నమ్ముకొని ముందుకు సాగుతున్న సమయంలో వచ్చిందే ఈ సినిమా పాటల అవకాశం. ‘రాను బొంబాయికి రాను’ పాటను విని హీరో విశాల్ నటించిన ‘మకుటం’ సినిమా టీమ్ నుంచి పిలుపొచ్చింది. అభిషేకన్న కాల్ చేసి వాయిస్ టెస్ట్‌కోసం ట్యూన్ పంపించమన్నాడు. నా గొంతు నచ్చడంతో ఒకే చేసి తెల్లారే పాట రికార్డింగ్ పూర్తిచేశారు. రెండో పాట ‘మండాడి’ సినిమాలో పాడాను. ఈ రెండు పాటలకు మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్ కుమార్ గారే కావడం విశేషం. ఇక మూడో పాట ‘ది ప్యారడైజ్’లో పాడాను. ఓ ఈవెంట్లో ఉన్నప్పుడు కాసర్ల శ్యామన్న ఫోన్ చేసి ప్యారడైజ్‌లో ఓ పాట పాడాలన్నాడు కానీ, ఏ పాటన్నది చెప్పలేదు. ‘యేషనాగుల కట్టమీద’ అని తర్వాత తెలిసింది. అనిరుధ్ సార్ లాంటి పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర పాడాలంటే భయమేసింది. శ్యామన్ననే ధైర్యం చెప్పి పాడించాడు. నాలో నేనే చాలా కసరత్తు చేసుకొని పాడిన. 40 నిమిషాల్లో రికార్డింగ్ పూర్తి చేశాం. ఆ పాట పాడినప్పుడు హిట్ అవుతుందని తెలుసు కానీ, ఈ స్థాయిలో ఆదరిస్తారని అనుకోలేదు. ఇప్పటివరకు ఈ పాట వ్యూస్ 100 మిలియన్లకు చేరింది. జానపద పాటను పెద్ద సినిమాలో పాడటం సంతోషంగా ఉంది. ఫోక్ ఇండస్ట్రీలో నా ఆత్మీయులంతా ఫోన్ చేసి మస్తు పాడినవని మెచ్చుకుంటున్నారు. ఇటీవల మరో మూడు సినిమా పాటలు పాడిన. అవి విడుదల కావాల్సి ఉంది.
వాళ్లను మరువలేను
ప్రారంభంలో ఎదురైన ఇబ్బందిని నేను ఎన్నటికీ మరిచిపోలేను. నాతో పాట పాడిస్తానని ఓ వ్యక్తి చెప్పడంతో నేను సేకరించిన పాట తీసుకొని స్టూడియోకి వెళ్తే వాళ్లు సంబంధం లేనట్లు వ్యవహరించారు. అది నాకో గుణపాఠం. ఆ అనుభవంతో కొత్తగా వచ్చే సింగర్లకు కొన్ని సలహాలిస్తుంటాను. ఇప్పటివరకు ఫోక్ ఇండస్ట్రీలో చాలా మంది ప్రోత్సహించారు. అందులో ముఖ్యంగా గజ్వేల్ వేణన్న, బచ్చలకూర సురేష్, మదిన్, రాజేందర్ కొండ లాంటి వాళ్లను మరిచిపోలేను. సినిమాల్లో మాత్రం కాసర్ల శ్యామన్న సొంత అన్నతో సమానం. ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత చాలా ఇబ్బందులు పడ్డాం. నా లక్ష్యం కోసం నా భర్త తన ఉద్యోగాన్ని త్యాగం చేసిండు. చాలామంది ఎగతాళిగా మాట్లాడినా వాటిని పట్టించుకోకుండా నా పిల్లలను ఓ తల్లిగా కంటికి రెప్పలా కాపాడుతూ నాకు తోడుగా నిలుస్తున్నాడు. ఆయన లేకుంటే నా స్వరం లేదు. సినిమా అవకాశాలు వచ్చినా నన్ను గుర్తించింది మాత్రం జానపదమే. సినిమా పాటలు పాడినా అమ్మలాంటి జానపదాలను ఎన్నడూ విడువను.
రాజు పిల్లనగోయిన
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
Sai Durga Tej | పుట్టినరోజున సాయిదుర్గా తేజ్ కొత్త సినిమా ప్రకటన.. ‘సేవ్ ది టైగర్స్’ దర్శకుడితో మెగా హీరో!
Flowers sale | రైతుకు కాసులు వర్షం కురిపిస్తున్న పూల పండుగ..!
Actor Imran Khan | బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ ఖాన్‌కు ‘లీవ్ ఇండియా’ నోటీసులు.. అక్టోబర్ 28లోపు దేశం విడిచి వెళ్లాలని ఆదేశం!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

