Richard Gasquet | ఫ్రెంచ్ ఆటగాడి అరుదైన ఘనత.. 600 మ్యాచులు గెలిచిన నాలుగో ప్లేయర్‌గా రికార్డు
Richard Gasquet : టెన్నిస్ చరిత్రలో ఫ్రెంచ్ ఆటగాడు రిచర్డ్ గాస్కెట్(Richard Gasquet) అరుదైన ఘనత సాధించాడు. ఆరొందల విజయాలతో దిగ్గజాల సరసన చేరాడు. మొత్తంగా నాలుగో ఆటగాడిగా రికార్డుల్లోకి ఎక్కాడు. బాస్ ఓపెన్(BOSS OPEN)లో 55వ సీడ్ రిచర్డ్ ఈ మైలురాయికి చేరువయ్యాడు. హోరాహోరీగా జరిగిన పోరులో ఐదో ర్యాంకర్ స్టెఫనోస్ థ్సిథ్సిపాస్(Stefanos Tsitsipas)ను....
Richard Gasquet : టెన్నిస్ చరిత్రలో ఫ్రెంచ్ ఆటగాడు రిచర్డ్ గాస్కెట్(Richard Gasquet) అరుదైన ఘనత సాధించాడు. ఆరొందల విజయాలతో దిగ్గజాల సరసన చేరాడు. మొత్తంగా నాలుగో ఆటగాడిగా రికార్డుల్లోకి ఎక్కాడు. ఇప్పటివరకు రఫెల్ నాదల్(Rafael Nadal), నోవాక్ జకోవిచ్(Novak Djokovic), ఆండీముర్రే(Andy Murray) మాత్రమే ఈ ఫీట్ సాధించారు.
బాస్ ఓపెన్(BOSS OPEN)లో 55వ సీడ్ రిచర్డ్ ఈ మైలురాయికి చేరువయ్యాడు. హోరాహోరీగా జరిగిన పోరులో ఐదో ర్యాంకర్ స్టెఫనోస్ థ్సిథ్సిపాస్(Stefanos Tsitsipas)ను అతడు ఓడించాడు. మూడు సెట్లలో 7-6(8), 2-6, 7-5తో చిత్తు చేశాడు. ఇది రిచర్డ్ గాస్కెట్కు 600వ విజయం. రికార్డు విక్టరీతో లెజెండ్స్ సరసన నిలవడం పట్ల గాస్కెట్ సంతోషం వ్యక్తం చేశాడు.
రిచర్డ్ గాస్కెట్ VS థ్సిథ్సిపాస్
ఇదే మొదటిసారి కాదు
‘ఇది నాకు నిజంగా గొప్ప విజయం. ఈ ఘతన సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇరవై ఏళ్లుగా ఆడుతున్నా. ఈరోజు 600 మ్యాచుల్లో విజయం నమోదు చేయడం చాలా అద్భుతంగా అనిపించింది’ అని గాస్కెట్ మ్యాచ్ అనంతరం తెలిపాడు. గాస్కెట్ తనకంటే మెరుగైన ర్యాంకు ఉన్న ప్లేయర్స్‌కు షాక్ ఇవ్వడం ఇదే మొదటిసారి కాదు. ఇప్పటివరకు చూస్తే.. ఐదో ర్యాంకులోపు ఆటగాళ్లను అతను 11 సార్లు ఓడించాడు. టాప్ 10లోని ఆటగాళ్లపై అతడు గెలుపొందడం ఇది 32వ సారి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

