ముంబై: రోహిత్ శర్మ(Rohit Sharma) ఫ్లాప్ షో కొనసాగుతోంది. రంజీలోనూ అతను రాణించలేకపోయాడు. ఇటీవల ఆస్ట్రేలియాతో ముగిసిన టెస్టు సిరీస్‌లో వరుసగా విఫలమైన రోహిత్ శర్మ.. దేశవాళీ క్రికెట్లో కూడా అదే ఫామ్‌ను కొనసాగించాడు. రంజీ ట్రోఫీలో భాగంగా ఇవాళ జమ్మూకశ్మీర్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను మూడు పరుగులకే ఔటయ్యాడు. 19 బంతులు ఆడిన రోహిత్ .. బంతుల్ని బౌండరీకి తరలించడంలో విఫలం అయ్యాడు. కశ్మీర్ బౌలర్ వేసిన బౌన్సర్‌కు అతను చిక్కాడు. ఫాస్ట్ బౌలర్ ఉమర్ నాజిర్ మీర్ అతన్ని ఔట్ చేశాడు. షార్ట్ ఆఫ్ లెన్త్ బంతిని .. హుక్ షాట్ ఆడబోయి రోహిత్ మిడాఫ్‌లో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. యుధిర్ సింగ్ అతని క్యాచ్ పట్టేశాడు.
Rohit Sharma Dismissed 3Run & 19 Balls..#RohitSharma #MUMvJK #RanjiTrophy pic.twitter.com/kp0MES4CCM
— CricketInfo (@cricketinfo2024) January 23, 2025
ఓపెనింగ్ పార్ట్నర్ యశస్వి జైస్వాల్ కూడా స్వల్ప రన్స్‌కే నిష్క్రమించాడు. జైస్వాల్ 4 రన్స్‌కే ఔటయ్యాడు. అకిబ్ నబీ బౌలింగ్‌లో అతను ఎల్బీడబ్ల్యూ ఔటయ్యాడు. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై కష్టాల్లో ఉన్నది. ఓ దశలో 47 పరుగులకే ఆ జట్టు ఏడు వికెట్లను కోల్పోయింది. అయితే 8వ వికెట్‌కు శార్దూల్ ఠాకూర్, తనుష్ కొటియాన్ కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. తాజా సమాచారం ప్రకారం 28 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 110 రన్స్ చేసింది. ఠాకూర్ 41, తనుష్ 26 రన్స్‌తో క్రీజ్‌లో ఉన్నారు.