IND vs USA : పొట్టి ప్రపంచ కప్‌లో మరో ఆసక్తికర పోరుకు వేళైంది. గ్రూప్ ‘ఏ’ నుంచి సూపర్ 8కు చేరువైన భారత్(India), అమెరికా(USA)లు మరికొన్ని నిమిషాల్లో తలపడనున్నాయి. న్యూయార్క్‌లోని నస్సౌ కౌంటీ స్టేడియంలో జరుగుతున్న పోరులో ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచాడు.
అమెరికా సారథి మొనాక్ పటేల్ బదులు అరోన్ జోన్స్(Aaron Jones) టాస్కు వచ్చాడు. వరుసగా రెండు విజయాలతో జోరు మీదున్న ఇరుజట్లకు ఇది కీలక మ్యాచ్. హ్యాట్రిక్ కొట్టేది ఎవరో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. అయితే.. ఈ పిచ్‌పై మొదట బ్యాటింగ్ చేసిన జట్టు మూడుసార్లు గెలవగా.. ఛేజింగ్ టీమ్‌ను నాలుగుసార్లు విజయం వరించింది.
భారత జట్టు : రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్(వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, శివం దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, సిరాజ్.
అమెరికా జట్టు : స్టీవెన్ టేలర్, శయాన్ జహంగీర్, ఆండ్రీస్ గౌస్(వికెట్ కీపర్), అరోన్ జోన్స్, నితీశ్ కుమార్, కొరే అండర్సన్, హర్మీత్ సింగ్, షాడ్లే వాన్, జస్దీప్ సింగ్, సౌరభ్ నేత్రవల్కర్, అలీ ఖాన్.
భారత్ విషయానికొస్తే.. ఓపెనర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల జోడీ క్లిక్ కాలేదు. రెండు మ్యాచుల్లోనూ కోహ్లీ రెండంకెల స్కోర్ కొట్టలే. హిట్‌మ్యాన్ సైతం దూకుడుగా ఆడలేకపోతున్నాడు. మూడో స్థానంలో పంత్ మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడుతూ రోహిత్ సేనకు కొడంత అండ అవుతున్నాడు. వైస్ కెప్టెన్ పాండ్యా సైతం బంతితో,బ్యాటుతో మెరుస్తున్నాడు. స్పీడ్‌స్టర్ జస్ప్రీత్ బుమ్రా పాకిస్థాన్‌పై అదరగొట్టాడు. దాంతో, అమెరికాపై భారత జట్టు పైచేయి సాధించే అవకాశాలే ఎక్కువున్నాయి.
It’s time for 🇺🇸 🆚 🇮🇳 in the Big Apple 🗽
India have won the toss and elected to field first against co-hosts USA.#T20WorldCup | #USAvIND | 📝: https://t.co/l3ueCxM0TP pic.twitter.com/nf73MLcADK
— ICC (@ICC) June 12, 2024
అలాగని ఆతిథ్య అమెరికాను రోహిత్ సేన తక్కువ అంచనా వేస్తే మూల్యం చెల్లుంచుకోవాల్సి రావొచ్చు. అవును.. సమిష్టితత్త్వంతో సూపర్ ఓవర్లో పాకిస్థాన్‌ను ఓడించిన యూఎస్ఏ టీమిండియాకు గట్టి పోటీ ఇవ్వడం ఖాయం. భారత మూలాలున్న పేసర్ సౌరభ్ నేత్రావల్కర్ సూపర్ బౌలింగ్ ఆ జట్టు బలం. ఇక బ్యాటింగ్‌లో అరోన్ జోన్స్ సిక్సర్ల మోత మెగిస్తున్నాడు. కెప్టెన్ మొనాక్ సైతం పాక్‌పై అర్ధ సెంచరీతో రాణించాడు. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు 6 పాయింట్లతో సూపర్ 8కు చేరడం ఖాయం. దాంతో.. లో స్కోర్లు నమోదవుతున్న నస్సౌ కౌంటీ ఇంటర్నేషనల్ స్టేడియంలో భారత్ .. అమెరికాను అల్లాడిస్తుందా? లేదా? చూడాలి.