Rohit Sharma : డేంజరస్ ఓపెనర్లలో ఒకడైన రోహిత్ శర్మ (Rohit Sharma) తన ఫామ్‌పై నెలకొన్న సందేహాల్ని పటాపంచలు చేశాడు. ఆస్ట్రేలియా పర్యటనే ఇక ఆఖరు అని కోడైకూసిన విమర్శకులకు చెక్ పెడుతూ ఖతర్నాక్ ఇన్సింగ్స్‌లతో అభిమానులను అలరించాడు. ఆసీస్ గడ్డపై వన్డేల్లో అత్యధిక శతకాలతో తన పర్యటనను ముగించాడీ హిట్‌మ్యాన్. సిడ్నీ(Sydney)లో రికార్డు బ్రేకింగ్ సెంచరీతో వన్డే వరల్డ్ కప్ ఆడేందుకు తాను సిద్ధమేనని చెప్పకనే చెప్పాడతడు. సిరీస్ ముగియడంతో.. బరువైన హృదయంతో కంగారూ దేశాన్ని వీడాడు రోహిత్. ఆదివారం సిడ్నీ విమానాశ్రయంలో దిగిన ఫొటోను అతడు అభిమానులతో పంచుకున్నాడు.
వన్డే కెప్టెన్సీ కోల్పోయిన రోహిత్ శర్మ.. ఆటగాడిగా రెచ్చిపోయాడు. ఇదివరకూ సారథిగా ఉన్న భారం తొలగిపోవడంతో స్వేచ్ఛగా, మరింత దూకుడగా ఆడాడు. పెర్త్‌లో త్వరగానే ఔటైనా.. ఆడిలైడ్‌లో క్రీజులో నిలబడి ఆస్ట్రేలియా పేస ద్వయం మిచెల్ స్టార్క్, హేజిల్‌వుడ్‌లను సమర్ధంగా ఎదుర్కొన్నాడు. ఆ మ్యాచ్‌లో శ్రేయస్ అయ్యర్‌తో కలిసి సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పిన అతడు.. సిడ్నీలో వీరవిహారం చేశాడు. తనకెంతో ఇష్టమైన స్టేడియంలో దంచేసిన హిగ్మ్యాన్ శతకంతో ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగించాడు.
One last time, signing off from Sydney 👊 pic.twitter.com/Tp4ILDfqJm
— Rohit Sharma (@ImRo45) October 26, 2025
తనవైన ఫుల్‌షాట్లు ఆడుతూ రెచ్చిపోయిన మాజీ కెప్టెన్.. విరాట్ కోహ్లీ(74 నాటౌట్) కలిసి జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. క్లాస్ ఆటతో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’, ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డులు అందుకున్న రోహిత్ ఆస్ట్రేలియాను వీడాడు. చివరిసారిగా వీడ్కోలు.. సిడ్నీ నుంచి బయల్దేరుతున్నా అని రోహిత్ పోస్ట్ పెట్టాడు. చివరిసారిగా వీడ్కోలు.. సిడ్నీ నుంచి బయల్దేరుతున్నా అని రోహిత్ పోస్ట్ పెట్టాడు.
కంగారూ బౌలర్లను ఉతికేస్తూ శతకంతో రెచ్చిపోయిన హిట్‌మ్యాన్ ఆసీస్‌పై 2,500 పరుగులు పూర్తి చేసుకున్నాడు. టీమిండియా వెటరన్ సచిన్ టెండూల్కర్ అనంతరం.. ఈ ఘనత సాధించిన రెండో భారత క్రికెటర్‌గా అతడు చరిత్రకెక్కాడు. కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టును గెలిపించిన ఇద్దరూ.. అత్యధిక శతక భాగస్వామ్యాలతో రికార్డు నెలకొల్పారు. విరాట్ 82 పర్యాయాలు, రోహిత్ 68 సార్లు వన్డేల్లో సెంచరీ పార్ట్నర్షిప్లో భాగమయ్యారు. ఈ జాబితాలో సచిన్ (99 సార్లు) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
Rohit Sharma owns Australia! 🔥🏏 pic.twitter.com/oqz2JcwRl6
— CricketGully (@thecricketgully) October 25, 2025
ఒకే ప్రత్యర్థిపై అత్యధిక శతకాలతో మరో మైలురాయి సాధించాడు రోహిత్. సిడ్నీలో చెలరేగిన హిట్‌మ్యాన్ ఆసీస్‌పై సెంచరీ కొట్టడం ఇది తొమ్మిదోసారి. అతడు సచిన్‌తో సంయుక్తంగా నిలిచాడు. కంగారూ గడ్డపై వన్డేల్లో రోహిత్‌కు ఇది ఆరో శతకం. అత్యధిక సెంచరీలు బాదిన పర్యాటక ఆటగాడిగా అతడు అగ్రస్థానంలో ఉండగా.. కోహ్లీ (5) రెండో స్థానంలో ఉన్నాడు.