కటక్: బౌలర్ హర్షిత్ రాణాపై నోరు పారేసుకున్నాడు కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma). ఇంగ్లండ్‌తో కటక్‌లో జరిగిన రెండో వన్డేలో ఈ ఘటన చోటుచేసుకున్నది. హర్షిత్ ఆవేశంలో బంతిని విసిరేయడంతో.. ఆ బాల్ బౌండరీ దాటింది. దీంతో ఇండ్లండ్ జట్టుకు నాలుగు బై రన్స్ వచ్చాయి. ఆ సమయంలో రోహిత్ శర్మ తన సహనాన్ని కోల్పోయాడు. ఇన్నింగ్స్ 32వ ఓవర్‌ను హర్షిత్ రాణా వేశాడు. ఆ ఓవర్ రెండో బంతికి నాలుగు ఎక్స్ట్రా రన్స్ వచ్చాయి. బ్యాటర్ జోస్ బట్లర్ క్రీజ్‌లోనే ఉన్నా.. అతని దిశగా అనవసరంగా హర్షిత్ బంతిని విసిరేశాడు. ఆ బాల్ స్టంప్స్‌కు దూరంగా వెళ్లింది. కీపర్ కూడా దాన్నిఅందుకోలేకపోయాడు. ఆ టైంలో రోహిత్ తన సహనాన్ని కోల్పోయాడు. హర్షిత్ వైపు సంకేతం చేస్తే.. దిమాక్ కిదర్ హై తేరా అంటూ అరిచాడు. మెదడు పనిచేస్తుందా లేదా అన్న ఉద్దేశంతో హర్షిత్‌పై రోహిత్ ఫైర్ అయ్యాడు. ఆ ఘటనకు చెందిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.
Rohit to Harshit: Dimag kidhar hai tera
Heis so pure guy 😭 pic.twitter.com/bJSV5Uk9ql
— MAHI (@mahiiii45) February 9, 2025
ఇంగ్లండ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి 304 రన్స్ చేయగా.. ఆ లక్ష్యాన్ని ఇండియా ఈజీగా అందుకున్నది. మరో 33 బంతులు మిగిలి ఉండగానే, 4 వికెట్ల తేడాతో నెగ్గింది. కెప్టెన్ రోహిత్ శర్మ సెంచరీతో చెలరేగాడు. అతను 119 రన్స్ చేసి ఔటయ్యాడు. ఇండియన్ బ్యాటర్లలో గిల్ 60, శ్రేయాస్ అయ్యర్ 44, అక్షర్ పటేల్ 41 రన్స్ చేశారు. జడేజా మూడు వికెట్లు తీసుకున్నాడు.