Rohit Sharma | ఆరోజు రూమ్‌లో కూర్చొని బాధ పడుతున్నా.. యూవీ అలా చెప్పడంతో మనసు తేలికైంది : రోహిత్
Rohit Sharma : ఐపీఎల్ కెప్టెన్‌గా విజయవంతమైన రోహిత్ శర్మ(Rohit Sharma) భారత జట్టుకు ఒక్క ఐసీసీ ట్రోఫీ(ICC Trophy) కూడా అందించలేకపోయాడు. అతడికి ఈసారిప్రపంచ కప్(ODI World Cup 2023) రూపంలో సువర్ణావకాశం దొరికింది. సొంత గడ్డపై జరుగనున్న ఈ మెగా టోర్నీలో సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నాడు. ప్రస్తుతం ఆసియా కప్(Asia Cup 2023) సన్నాహకాల్లో ఉన్న రోహిత్ 2011 వరల్డ్ కప్ జట్టులో....
Rohit Sharma : ఐపీఎల్ కెప్టెన్‌గా విజయవంతమైన రోహిత్ శర్మ(Rohit Sharma) భారత జట్టుకు ఒక్క ఐసీసీ ట్రోఫీ(ICC Trophy) కూడా అందించలేకపోయాడు. అతడికి ఈసారిప్రపంచ కప్(ODI World Cup 2023) రూపంలో సువర్ణావకాశం దొరికింది. సొంత గడ్డపై జరుగనున్న ఈ మెగా టోర్నీలో సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నాడు. ప్రస్తుతం ఆసియా కప్(Asia Cup 2023) సన్నాహకాల్లో ఉన్న రోహిత్ 2011 వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కకపోవడంపై పెదవి విప్పాడు. అప్పుడు తాను తీవ్ర నిరాశకు గురయ్యానని, ఆ సమయంలో ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్(Yuvraj Singh) ధైర్యం చెప్పాడని హిట్‌మ్యాన్ తెలిపాడు.
‘ఆరోజు నేను రూమ్‌లో కూర్చొని బాధ పడుతున్నా. ఆ సమయంలో ఏం చేయాలో నాకు దిక్కు తోచలేదు. సరిగ్గా అప్పుడే యువరాజ్ సింగ్ తన గదికి పిలిచాడు. ఇద్దరం కలిసి బయట డిన్నర్ చేసేందుకు వెళ్లాం అని రోహిత్ గుర్తు చేసుకున్నాడు. ఆరోజు యూవీ తనకు ధైర్యం చెప్పిన తీరును వివరించాడిలా. జట్టులో చోటు దక్కనప్పుడు ఎంత బాధగా ఉంటుందో నాకు తెలుసు. అయితే.. మంచి విషయం ఏంటంటే నీకు ఇంకా చాలా సమయం ఉంది. మేము వరల్డ్ కప్ ఆడే ఈ టైమ్‌లో నువ్వు నీ ఆటపై బాగా దృష్టి పెట్టు. నైపుణ్యం పెంచుకొని జట్టులోకి రా. అప్పుడు నీవు వరల్డ్ కప్ ఆడకపోవడం అనేది ఉండదని యూవీ నాతో అన్నాడు’ అని రోహిత్ చెప్పుకొచ్చాడు. 2011లో ధోనీ(MS Dhoni) నేతృత్వంలోని భారత జట్టు చాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే.
2019 వరల్డ్ కప్‌లో 5 శతకాలు బాదిన రోహిత్ శర్మ

విధ్వసంక ఓపెనర్ అయిన రోహిత్ శర్మకు ఇది మూడో వరల్డ్ కప్. అతడు 2015లో తొలిసారి ప్రపంచ కప్‌లో ఆడాడు. ఆ టోర్నీలో 330 రన్స్ చేశాడు. ఇక 2019 వరల్డ్ కప్‌లో వైస్ కెప్టెన్‌గా బరిలోకి దిగిన హిట్‌మ్యాన్ వరుస సెంచరీలతో విరుచుకుపడ్డాడు. ఒకే ప్రపంచ కప్‌లో ఐదు శతకాలు బాదిన తొలి క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. ఈ టోర్నీలో రోహిత్ 648 రన్స్ కొట్టాడు. టాప్ స్కోరర్‌గా నిలిచిన అతడికి ‘గోల్డెన్ బ్యాట్ అవార్డు’ లభించింది. ఈసారి ప్రపంచ కప్ పోటీలకు భారత్ ఆతిథ్యం ఇస్తోంది. అక్టోబర్ 5న ఈ మెగా టోర్నీ మొదలవ్వనుంది. తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్, న్యూజిలాండ్ ఢీ కొననున్నాయి. ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్న టీమిండియా అక్టోబర్ 14న పాకిస్థాన్‌తో తలపడనుంది.
ఇవి కూడా చదవండి
Anand Mahindra | ప్రజ్ఞానంద తల్లిదండ్రులకు అదిరిపోయే గిఫ్ట్.. టెక్ దిగ్గజం అందిస్తున్న కారు ఇదే..!
Neeraj Chopra: వరల్డ్ అథ్లెటిక్స్‌లో గోల్డ్ మెడల్.. నీరజ్ చోప్రా ఎంత ప్రైజ్‌మనీ గెలుచుకున్నాడో తెలుసా?
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KCR | ఆత్మగౌరవాన్ని చాటే సాంస్కృతిక వైభవం బతుకమ్మ.. రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ శుభాకాంక్షలు
Tamilnadu SIR | తమిళనాడులో సర్ షాక్.. పట్టించుకోకపోవడంతో 50 సీట్లు చేజార్చుకున్న స్టాలిన్ సేన!
Elon Musk | ప్రైమ్ మినిస్టర్ అంబానీ.. ఎలాన్ మస్క్ వ్యంగ్యాస్త్రాలు
Manne Krishank | రూ.80 వేల కోట్ల భూమి 10 వేల కోట్లకే.. 818 ఎకరాలను గుట్టుగా తాకట్టు పెట్టిన రేవంత్ సర్కార్: మన్నె క్రిశాంక్
Land Scam | 818 ఎకరాలు తాకట్టు.. కంచె గచ్చిబౌలి తరహాలో రేవంత్ సర్కార్ మరో భూ బాగోతం
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

