Anand Mahindra | ప్రజ్ఞానంద తల్లిదండ్రులకు అదిరిపోయే గిఫ్ట్.. టెక్ దిగ్గజం అందిస్తున్న కారు ఇదే..!
Anand Mahindra : ఫిడే వరల్డ్ కప్ రన్నరప్ ప్రజ్ఞానంద(Praggnanandhaa) పేరు ఇప్పుడు దేశమంతా మార్మోగిపోతోంది. 18 ఏళ్ల ఈ గ్రాండ్ మాస్టర్ విశ్వవేదికపై భారత దేశ మేధస్సుకు ప్రతీకగా నిలిచిన తీరు అందర్నీ ఆకట్టుకుంది. అందుకని అతడి కుటుంబానికి టెక్ దిగ్గజం ఆనంద్ మహీంద్ర (Anand Mahindra) అదిరిపోయే బహుమతి ఇవ్వనున్నాడు. త్వరలోనే వాళ్ల ఇంట కొత్త...
Anand Mahindra : ఫిడే వరల్డ్ కప్ రన్నరప్ ప్రజ్ఞానంద(Praggnanandhaa) పేరు ఇప్పుడు దేశమంతా మార్మోగిపోతోంది. 18 ఏళ్ల ఈ గ్రాండ్ మాస్టర్ విశ్వవేదికపై భారత దేశ మేధస్సుకు ప్రతీకగా నిలిచిన తీరు అందర్నీ ఆకట్టుకుంది. అందుకని అతడి కుటుంబానికి టెక్ దిగ్గజం ఆనంద్ మహీంద్ర(Anand Mahindra) అదిరిపోయే బహుమతి ఇవ్వనున్నాడు. త్వరలోనే వాళ్ల ఇంట కొత్త ఎలక్ట్రిక్ కారు(Electric Car) కొలువుదీరనుంది. ఈ విషయాన్ని స్వయంగా ఆనంద్ మహీంద్ర సోషల్ మీడియాలో వెల్లడించాడు.
‘ప్రపంచ కప్‌లో రన్నరప్‌గా నిలిచిన ప్రజ్ఞానందకు థార్ కారు గిఫ్ట్‌గా ఇవ్వాలని చాలామంది నన్ను అడిగారు. అయితే.. నా మనసులో మరో ఆలోచన ఉంది. తల్లిదండ్రులు తమ పిల్లల్ని చెస్ ఆడేలా ప్రోత్సహించేలా చేయాలని కోరుతున్నా. వీడియో గేమ్స్ బదులు పిల్లలకు నచ్చిన ఆటల్లో అడుగుపెట్టనివ్వండి. అది ఒకరకంగా వాళ్ల అందమైన భవిష్యత్తుకు పెట్టుబడి లాంటిది. ఎలాగంటే.. ఎలక్ట్రిక్ వెహికిల్స్లా. అందుకని నేను ప్రజ్ఞానంద తల్లిదండ్రులు నాగలక్ష్మి, రమేష్ బాబులకు XUV4OO EV కారును బహుమతిగా ఇస్తున్నా.
Appreciate your sentiment, Krishlay, & many, like you, have been urging me to gift a Thar to @rpragchess
But I have another idea …
I would like to encourage parents to introduce their children to Chess & support them as they pursue this cerebral game (despite the surge in… https://t.co/oYeDeRNhyh pic.twitter.com/IlFIcqJIjm— anand mahindra (@anandmahindra) August 28, 2023
XUV4OO EV కారు

తమ కొడుకు కలను గుర్తించి, అతడికి మద్దతుగా నిలిచినందుకు వాళ్లు మన కృతజ్ఞతకు అర్హులు’ అని మహీంద్ర తన పోస్ట్‌లో రాసుకొచ్చాడు. ప్రపంచ వేదికలపై భారత దేశం గర్వపడేలా చేసిన పలువురు క్రీడాకారులకు మహీంద్ర ఇప్పటికే థార్ కారును బహుమతిగా ఇచ్చాడు. ఆ జాబితాలో తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్, క్రికెటర్ నటరాజన్ తదితరులు ఉన్నారు.
మాగ్నస్ కార్ల్సన్, ప్రజ్ఞానంద

అజర్బైజాన్లో ఈ మధ్యే ముగిసిన ప్రపంచ చాంపియన్ ఫైనల్లో ప్రజ్ఞానంద అద్వితీయ పోరాటంతో ఆకట్టుకున్నాడు. అయితే.. టై బ్రేక్(Tie Break)లో వెనకబడి టైటిల్ చేజార్చుకున్నాడు. దాంతో, మాగ్నస్ కార్ల్సన్(Magnus Carlsen) కెరీర్లో మొదటి ఫిడే వరల్డ్ కప్ ట్రోఫీని సొంతం చేసుకున్నాడు. రన్నరప్‌గా నిలిచిన ప్రజ్ఞానంద కెరీర్లోనే అత్యధిక రేటింగ్స్ సాధించాడు. ఈ గ్రాండ్‌మాస్టర్ 2727.2 పాయింట్లు సొంతం చేసుకున్నాడు. అంతేకాదు లైవ్ రేటింగ్స్‌లో టాప్ 20 ర్యాంక్‌లో నిలిచాడు.
ఇవి కూడా చదవండి
Neeraj Chopra: వరల్డ్ అథ్లెటిక్స్‌లో గోల్డ్ మెడల్.. నీరజ్ చోప్రా ఎంత ప్రైజ్‌మనీ గెలుచుకున్నాడో తెలుసా?
US Open 2023 | కళ తప్పనున్న యూఎస్ ఓపెన్.. టోర్నీ నుంచి వైదొలిగిన మాజీ చాంపియన్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

