US Open 2023 | కళ తప్పనున్న యూఎస్ ఓపెన్.. టోర్నీ నుంచి వైదొలిగిన మాజీ చాంపియన్
US Open 2023 : ఈసారి యూఎస్ ఓపెన్(US Open 2023) కళ తప్పనుంది. మహిళల సింగిల్స్‌లో మాజీ చాంపియన్ బియంకా అండ్రెస్క్(Bianca Andreescu) టోర్నీ నుంచి వైదొలగడమే అందుకు కారణం. వెన్నెముక గాయం(Back Injury) కారణంగా టోర్నీ నుంచి తప్పుకుంటున్నట్టు ఆమె నిర్వాహకులకు తెలిపింది. 'వాషింగ్టన్లో జరిగిన సిన్సినాటి మాస్టర్స్(Cincinnati Masters) టోర్నీ సమయంలోనే....
US Open 2023 : ఈసారి యూఎస్ ఓపెన్(US Open 2023) కళ తప్పనుంది. మహిళల సింగిల్స్‌లో మాజీ చాంపియన్ బియంకా అండ్రెస్క్(Bianca Andreescu) టోర్నీ నుంచి వైదొలగడమే అందుకు కారణం. వెన్నెముక గాయం(Back Injury) కారణంగా టోర్నీ నుంచి తప్పుకుంటున్నట్టు ఆమె నిర్వాహకులకు తెలిపింది. ‘వాషింగ్టన్లో జరిగిన సిన్సినాటి మాస్టర్స్(Cincinnati Masters) టోర్నీ సమయంలోనే వెన్నులో నొప్పి మొదలైంది. క్రమంగా ఆ నొప్పి తీవ్రత ఎక్కువైంది. దాంతో, ఆ తెల్లారి శక్తినంతా కూడదీసుకొని ఆడాను. ఆ తర్వాత వైద్య పరీక్షలు చేయించుకున్నా. వెన్నెముకలో చిన్నపాటి గాయం అయినట్టు స్కానింగ్‌లో తేలింది.
అందుకని విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నా. నా గురించి బాగా తెలిసిన వాళ్లకు ఈ నిర్ణయం తీసుకోవడం ఎంత కష్టమో అర్థమవుతుంది. వచ్చే ఏడాది మీ అందర్నీ కలుస్తాను. మరింత బలంగా తిరిగొస్తాను’ అని ఈ సెర్బియా స్టార్ వెల్లడించింది. 2019లో బియాంక చాంపియన్‌గా నిలిచింది. ఫైనల్లో ఓడించి ట్రోఫీని అందుకుంది.
2019లో యూఎస్ ఓపెన్ ట్రోఫీ అందుకున్న బియంకా

యూఎస్ ఓపెన్ ప్రారంభం కానుంది. తొలిరౌండ్లో బియాంక ఉక్రెయిన్‌కు చెందిన లెసియా సురెన్కో(Lesia Tsurenko)తో తలపడాల్సి ఉంది. కానీ, గాయంతో ఆమె తప్పుకోవడంతో లెసియా రెండో రౌండ్లో అడుగు పెట్టనుంది. అంతేకాదు మాజీ వరల్డ్ నంబర్ 2 పౌల బడోస(Paula Badosa) కూడా గాయం కారణంగా టోర్నీ నుంచి వైదొలుగుతున్నట్టు తెలిపింది. దాంతో, మొదటి రౌండ్లో ఆమె ప్రత్యర్థి మాజీ చాంపియన్ వీనస్ విలియమ్స్(Venus Williams) రెండో రౌండ్లో కాలు మోపనుంది.
ఇవి కూడా చదవండి
Kane Williamson | విలియమ్సన్కు రెండు వారాల గడువు.. ఫిట్‌గా ఉంటేనే వరల్డ్ కప్ జట్టులోకి
Glenn Maxwel | ఆస్ట్రేలియాకు పెద్ద షాక్.. దక్షిణాఫ్రికా టీ20 సిరీస్‌కు స్టార్ ఆల్‌రౌండర్ దూరం
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

