Glenn Maxwel | ఆస్ట్రేలియాకు పెద్ద షాక్.. దక్షిణాఫ్రికా టీ20 సిరీస్‌కు స్టార్ ఆల్‌రౌండర్ దూరం
Glenn Maxwel :దక్షిణాఫ్రికా టీ20 సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియా(Australia)కు పెద్ద షాక్ తగిలింది. ఇప్పటికే స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్ గాయాల బారిన పడగా తాజాగా స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్(Glenn Maxwel) కూడా గాయపడ్డాడు. శిక్షణా శిబిరంలో మ్యాక్సీ ఎడమ కాలి చీలమండ(Ankle Injury)కు మళ్లీ గాయం అయింది. 2021 నవంబర్‌లో...
Glenn Maxwel :దక్షిణాఫ్రికా టీ20 సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియా(Australia)కు పెద్ద షాక్ తగిలింది. ఇప్పటికే స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్ గాయాల బారిన పడగా తాజాగా స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్(Glenn Maxwel) కూడా గాయపడ్డాడు. శిక్షణా శిబిరంలో మ్యాక్సీ ఎడమ కాలి చీలమండ(Ankle Injury)కు మళ్లీ గాయం అయింది. 2021 నవంబర్‌లో ఎడమ కాలికి దెబ్బ తగలడంతో మెటల్ ప్లేట్స్ అమర్చుకున్నాడు. ఇప్పుడు అదే చోట గాయం కావడంతో అతను సిరీస్‌కు దూరమయ్యాడు. వరల్డ్ కప్ ముందు భారత్‌తో జరిగే వన్డే సిరీస్ కల్లా మ్యాక్స్‌వెల్ కోలుకుంటాడని క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది.
‘మ్యాక్స్‌వెల్ గాయం తీవ్రత, అతను కోలుకునే తీరును దగ్గరుండి పరిశీలిస్తాం. అతను టీమిండియాతో వన్డే సిరీస్‌లో బరిలోకి దిగుతాడనే నమ్మకం ఉంది’ అని సెలెక్టర్ టోనీ డొడెమెడ్(Tony Dodemaide) ఓ ప్రకటనలో వెల్లడించాడు. సఫారీ జట్టుతో వన్డే సిరీస్‌కు ఎంపికవ్వని మ్యాక్సీ స్వదేశం బయలుదేరనున్నాడు. అతడి భార్య వినీ మ్యాక్స్‌వెల్(Vini Maxwell) త్వరలోనే మొదటి బిడ్డకు జన్మనివ్వనున్న విషయం తెలిసిందే.
గ్లెన్ మ్యాక్స్‌వెల్

మ్యాక్స్‌వెల్ స్టానంలో వికెట్ కీపర్ మాథ్యూ వేడ్(Matthew Wade) జట్టులోకి వచ్చాడు. నిరుడు టీ20 వరల్డ్ కప్ తర్వాత ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. దాంతో, అతడి కెరీర్ ముగిసింది అనుకున్నారంతా. కానీ, చీఫ్ సెలెక్టర్ జార్జ్ బెయిలీ వేడ్‌కు మద్దతు పలికాడు. దాంతో, అతడు ప్రపంచ కప్ తర్వాత భారత్‌తో జరిగే టీ20 సిరీస్ జట్టుకు కూడా ఎంపికయ్యే అవకాశం ఉంది. దక్షిణాఫ్రికా టీ20 సిరీస్‌కు ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్(Mitchell Marsh) సారథ్యం వహించనున్నాడు. ఆగస్టు 30వ తేదీన మొదటి టీ20 షురూ కానుంది.
ఇవి కూడా చదవండి
Shadab Khan | టీమిండియా చీఫ్ సెలెక్టర్‌పై పాకిస్థాన్ ఆల్‌రౌండర్ ఆగ్రహం.. అందుకేనా..?
Neeraj Chopra | క్షమించండి అలా చేయలేను.. దేశభక్తిని చాటుకున్న నీరజ్ చోప్రా
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

