Kane Williamson | విలియమ్సన్కు రెండు వారాల గడువు.. ఫిట్‌గా ఉంటేనే వరల్డ్ కప్ జట్టులోకి
Kane Williamson : వన్డే వరల్డ్ కప్(ODI WC 2023) సమీపిస్తున్నందున న్యూజిలాండ్ (Newzealand) జట్టు స్టార్ ఆటగాడు కేన్ విలియమ్సన్ (Kane Williamson)పై గంపెడు ఆశలు పెట్టుకుంది. మెడ్కోచ్ గ్యారీ స్టీడ్(Gary Stead)తో సహా అందరూ వరల్డ్ కప్ జట్టులో విలియమ్సన్ ఉండాలని కోరుకుంటున్నారు. అయితే.. ఈ స్టార్ ప్లేయర్ ప్రపంచ కప్ జట్టులో...
Kane Williamson : వన్డే వరల్డ్ కప్(ODI WC 2023) సమీపిస్తున్నందున న్యూజిలాండ్(Newzealand) జట్టు స్టార్ ఆటగాడు కేన్ విలియమ్సన్ (Kane Williamson)పై గంపెడు ఆశలు పెట్టుకుంది. మెడ్కోచ్ గ్యారీ స్టీడ్(Gary Stead)తో సహా అందరూ వరల్డ్ కప్ జట్టులో విలియమ్సన్ ఉండాలని కోరుకుంటున్నారు. అయితే.. ఈ స్టార్ ప్లేయర్ ప్రపంచ కప్ జట్టులో ఉంటాడా? లేదా? అనేది మరికొన్ని రోజుల్లో తేలిపోనుంది. అవును.. ఫిట్నెస్ నిరూపించుకునేందుకు అతడికి మేనేజ్మెంట్ రెండు వారాల గడువు విధించింది. ఆలోపు ఫిట్నెస్ సాధిస్తే సరే. లేదంటే ఇక అంతే సంగతి.
‘ఇప్పటి నుంచి రెండు వారాల సమయం ఉంది. అప్పటి వరకు మేము వరల్డ్ కప్ జట్టును ప్రకటించం. అందుకని విలియమ్సన్కు తనను తాను నిరూపించుకునేందుకు అన్ని అవకాశాలు కల్పిస్తున్నాం. అతడు ఆలోపు ఫిట్నెస్ సాధిస్తాడని భావిస్తున్నా. అయితే.. అదంతా తేలికైన పని కాదని తెలుసు’ అని కివీస్ హెడ్‌కోచ్ తెలిపాడు.
ఐపీఎల్ 16వ సీజన్ ఆరంభ మ్యాచ్‌లో గాయపడిన విలియమ్సన్

విలియమ్సన్ అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమై 5 నెలలు కావొస్తోంది. ఐపీఎల్ 16వ సీజన్ ఆరంభ మ్యాచ్‌లో గాయపడిన అతను స్వదేశంలో మోకాలి సర్జరీ చేయించుకున్నాడు. ఈమధ్యే కోలుకున్న విలియమ్సన్ నెట్స్‌లో ఏమాత్రం ఇబ్బంది లేకుండా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. దాంతో సెలెక్టర్లు అతడు ఫిట్‌గా మారేందుకు మరింత సమయం ఇవ్వాలనుకున్నారు. అందుకని ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు సన్నద్ధమవుతున్న జట్టుతో విలియమ్సన్ ప్రాక్టీస్ చేయనున్నాడు.
నెట్స్‌లో విలియమ్సన్ బ్యాటింగ్ ప్రాక్టీస్

మిడిలార్డర్లో కీలకమైన ఈ స్టార్ ప్లేయర్ 2019లో కివీస్‌ను ఫైనల్‌కు చేర్చాడు. అయితే.. బెన్ స్టోక్స్ తుఫాన్ ఇన్నింగ్స్, జోఫ్రా ఆర్చర్ సూపర్ స్పెల్‌లో ఇంగ్లండ్ బ్యాక్క్యాప్స్ను ఓడించింది. అందుకని న్యూజిలాండ్ జట్టు అప్పుడు చేజారిన వరల్డ్ కప్ ట్రోఫీని ఈసారి ఒడిసి పట్టుకోవాలనే పట్టుదలతో ఉంది. భారత గడ్డపై అక్టోబర్ 5న ఈ మెగా టోర్నీ షురూ కానుంది. ఆరంభ మ్యాచ్‌లో కివీస్, ఇంగ్లండ్‌ను ఢీ కొట్టనుంది.
ఇవి కూడా చదవండి
Glenn Maxwel | ఆస్ట్రేలియాకు పెద్ద షాక్.. దక్షిణాఫ్రికా టీ20 సిరీస్‌కు స్టార్ ఆల్‌రౌండర్ దూరం
Shadab Khan | టీమిండియా చీఫ్ సెలెక్టర్‌పై పాకిస్థాన్ ఆల్‌రౌండర్ ఆగ్రహం.. అందుకేనా..?
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దక్షిణాది వారికే ఛాన్స్ ఇవ్వాలి
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

