ముంబై: పొట్టి ఫార్మాట్ ప్రభావంతో వన్డేల్లోనూ వేగం పెరిగిందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ పేర్కొన్నాడు. ఈ ఏడాది జరుగనున్న వన్డే వరల్డ్కప్ షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో రోహిత్ స్పందించాడు.
‘ఈ ప్రపంచకప్లో పోటీ తీవ్రంగా ఉంటుంది. టీ20ల కారణంగా ఆటలో వేగం పెరిగింది. దానికి తగ్గట్లు సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలి. ఇప్పటి నుంచే ప్రపంచకప్ సన్నాహకాలు మొదలెట్టాలి’ అని రోహిత్ పేర్కొన్నాడు.