న్యూఢిల్లీ : స్వదేశం వేదికగా 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఓటమి తర్వాత క్రికెట్‌కు వీడ్కోలు పలుకుదామనుకున్నట్లు రోహిత్‌శర్మ పేర్కొన్నాడు. సోమవారం జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న రోహిత్ మాట్లాడుతూ ‘ఆస్ట్రేలియాతో ప్రపంచకప్ ఫైనల్ ముగిసిన తర్వాత చాలా నిరుత్సాహానికి గురయ్యాను.
మళ్లీ క్రికెట్ ఆడాలనుకోలేదు. షాకింగ్‌కు గురి చేసిన ఓటమి నుంచి తేరుకునేందుకు సమయం పట్టింది.తుదిపోరులో ఆసీస్‌పై ఎలా ఓడిపోయామో అర్థం కాలేదు’ అని అన్నాడు.