Rohit Sharma : టీమిండియా 13 ఏండ్ల ఐసీసీ ట్రోఫీ కలను నిజం అయిన క్షణం క్రికెటర్లలో అమితమైన భావోద్వేగం. జాతీయ జెండాను సగర్వంగా ఎగరేసిన ఆ సందర్భంలో మాటలు రాని పరిస్థితి. జూన్ 30వ తేదీన వెస్టిండీస్‌లోని కరీబియన్ గడ్డపై రోహిత్ శర్మ (Rohit Sharma) దాదాపు ఇదే అనుభూతికి లోనయ్యాడు. పొట్టి ప్రపంచ కప్ ట్రోఫీ విజయంతో యావత్ భారతావనని సంతోషంలో ముంచెత్తిన హిట్‌మ్యాన్ రిటైర్మెంట్ ప్రకటించాడు. విరాట్ కోహ్లీతో పాటు తాను కూడా ఇక టీ20లకు గుడ్ బై పలుతున్నట్టు చెప్పేశాడు. అయితే.. ఆరోజే పొట్టి ఫార్మాట్‌కు అల్విదా పలకడం వెనక కారణం ఉందంటున్నాడు రోహిత్.
‘ఆరోజు నేను టీ20లకు వీడ్కోలు పలకడానికి కారణం.. నా సమయం వచ్చేసిందని అనిపించింది. నేను పొట్టి ఫార్మాట్‌ను చాలా ఆస్వాదించాను. 17 ఏండ్లు టీ20లు ఆడాను. బార్బడోస్‌లో వరల్డ్ కప్ అందుకోగానే వీడ్కోలు పలకాల్సిన టైమ్ ఇదేనని అనుకున్నా. అయితే.. ఇప్పటికీ నేను మూడు ఫార్మట్లలో ఏ ఇబ్బంది లేకుండా ఆడగలను’ అని రోహిత్ వెల్లడించాడు.
🇮🇳, this is for 𝐘𝐎𝐔. pic.twitter.com/DSxE2gzgfw
— Rohit Sharma (@ImRo45) July 5, 2024
బార్బడోస్‌లో జరిగిన ఫైనల్లో టీమిండియా 7 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా(South Africa)ను ఓడించి రెండోసారి పొట్టి ప్రపంచకప్‌ను ముద్దాడింది. మొదట మహేంద్ర సింగ్ ధోనీ(MS Dhoni) సారథ్యంలోని భారత్ తొలి సీజన్లోనే టీ20 వరల్డ్ కప్ చాంపియన్‌గా అవతరించింది.