Vijay Mallya | ‘నేను భారత్కు తిరిగిరాలేను’.. బాంబే హైకోర్టుకు స్పష్టంచేసిన విజయ్ మాల్యా
Vijay Mallya | పరారీలో ఉన్న వ్యాపారవేత్త విజయ్ మాల్యా (Vijay Malya).. తాను భారత్కు తిరిగిరాలేనని బాంబే హైకోర్టు (Bombay High Court) కు తెలియజేశారు. తాను బ్రిటన్ను దాటి రాకుండా చట్టపరమైన ఆంక్షలు ఉన్నాయని, అందువల్ల తాను భారత్కు ఎప్పుడు తిరిగి వస్తాననేది కచ్చితంగా చెప్పలేనని మాల్యా పేర్కొన్నారు.
Vijay Mallya : పరారీలో ఉన్న వ్యాపారవేత్త విజయ్ మాల్యా (Vijay Malya).. తాను భారత్కు తిరిగిరాలేనని బాంబే హైకోర్టు (Bombay High Court) కు తెలియజేశారు. తాను బ్రిటన్ను దాటి రాకుండా చట్టపరమైన ఆంక్షలు ఉన్నాయని, అందువల్ల తాను భారత్కు ఎప్పుడు తిరిగి వస్తాననేది కచ్చితంగా చెప్పలేనని మాల్యా పేర్కొన్నారు.
ఈ మేరకు విజయ్ మాల్యా తరఫు న్యాయవాది అమిత్ దేశాయ్ (Amit Desai).. బాంబే కోర్టులో ఒక స్టేట్మెంట్ను సబ్మిట్ చేశారు. మాల్యా దగ్గర యాక్టివ్ ఇండియన్ పాస్పోర్టు లేదని, అదేవిధంగా దేశం దాటి వెళ్లకుండా ఇంగ్లండ్, వేల్స్ కోర్టుల ఆంక్షలు ఉన్నాయని ఆ సబ్మిషన్లో అమిత్ దేశాయ్ పేర్కొన్నారు.
బాంబే హైకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రశేఖర్, జస్టిస్ గౌతమ్ అనఖాద్లతో కూడిన ధర్మాసనం.. గత వారం విజయ్ మాల్యా పిటిషన్పై విచారణకు నిరాకరించింది. తనను పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడిగా ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ మాల్యా దాఖలు చేసిన పిటిషన్పై.. అతను భారత్కు రాకుండా విచారణ జరపలేమని స్పష్టం చేసింది. మాల్యాకు భారత్కు తిరిగొచ్చే ఉద్దేశం ఉందా.. లేదా..? అని ప్రశ్నించింది.
ఈ నేపథ్యంలో విజయ్ మాల్యా తన తరఫు న్యాయవాది ద్వారా బాంబే హైకోర్టులో తాజా స్టేట్మెంట్ను సబ్మిట్ చేశారు. మాల్యా పిటిషన్ విచారణ జరిపేందుకు ఆయన ప్రత్యక్షంగా కోర్టుకు హాజరు కావాల్సిన అవసరం లేదని దేశాయ్ వాదించారు. కాగా మాల్యా 2016 మార్చి నుంచి యూకేలో ఉంటున్నారు. లోన్ల ఎగవేత, మనిలాండరింగ్ తదితర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయనను 2019లో పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడిగా ప్రకటించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rajnath Singh | ఇండియన్ ఎయిర్ఫోర్స్ సిబ్బందితో కలసి రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ దీపావళి వేడుకలు..!
నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రి నిర్వహణపై మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఆగ్రహం
Parking Dispute: పార్కింగ్ వివాదం.. 15 రౌండ్ల కాల్పులు.. టెక్ మహేంద్ర మాజీ ఉద్యోగి మృతి
Y.S. Jagan | వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అక్రమ అరెస్టు అత్యంత హేయం : వైఎస్ జగన్
లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
ట్రెండింగ్ వార్తలు
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!

