Rohit Sharma | సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదో టెస్టు మ్యాచ్‌లో తొలిరోజు సామ్ కాన్స్టాస్, ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా వివాదంపై రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. ఏ కారణం లేకుండా ఆటగాళ్లు గొడవకు దిగడం తగదని చెప్పాడు. మెల్బోర్న్లో జరిగిన నాల్గో టెస్టులో బుమ్రా-కాన్స్టాస్ మధ్య పోటీ కనిపించింది. ఆస్ట్రేలియా యువ బ్యాట్స్‌మెన్ కాన్స్టాస్.. బుమ్రా బౌలింగ్‌కు కాస్త దూకుడు ప్రదర్శించాడు. రెండో ఇన్నింగ్స్‌లో బుమ్రా బౌలింగ్‌లోనే కాన్స్టాస్ అవుట్ అయ్యాడు.
ఐదో టెస్టు తొలిరోజు ఆటముగిసేందుకు చివరి ఓవర్లో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ సమయంలో బుమ్రా తన మూడో ఓవర్లో ఐదు బంతిని వేయడానికి రన్ అప్ తీసుకుంటుండగా.. బ్యాట్స్‌మెన్ ఖవాజా బ్యాటింగ్‌కు సిద్ధంగా లేకపోవడంతో బుమ్రా అసంతృప్తి వ్యక్తం చేశాడు. మరో ఎండ్‌లో ఉన్న కాన్స్టాస్ బుమ్రా వైపు చూస్తూ ఏదో గొణుగుతూ కనిపించాడు. దాంతో బుమ్రా ఆగ్రహం వ్యక్తం చేస్తూ అతని వైపు వెళ్లేందుకు ప్రయత్నించగా.. అంపైర్ జోక్యం చేసుకొని కాన్స్టాస్ను బుమ్రా వద్దకు రాకుండా అడ్డుకున్నాడు. దాన్ని చూసిన ప్రేక్షకులు పెద్ద ఎత్తున కేకలు వేశారు. దాంతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది.
భారత ఆటగాళ్ల దృష్టి తమ పనిపైనే ఉందని రోహిత్ పేర్కొన్నాడు. ఐదు టెస్టు రెండోరోజు లంచ్ సమయంలో రోహిత్ బ్రాడ్‌కాస్టర్‌తో మాట్లాడుతూ ఆస్ట్రేలియా ఆటగాళ్లు ప్రశాంతంగా ఉంటే.. తమ ఆటగాళ్లు సైతం ప్రశాంతంగా ఉంటారన్నారు. వారిని రెచ్చగొడితే ప్రశాంతంగా ఉండరని స్పష్టం చేశాడు. ఇక బుమ్రాపై రోహిత్ ప్రశంసలు కురిపించాడు. ఆటపై అతనికి మంచి ఆలోచన ఉందని.. తన బౌలింగ్‌తో మిగతా వారికి ఆదర్శంగా నిలిచాడని తెలిపాడు. అతన్ని 11 సంవత్సరాలుగా గమనిస్తున్నానని.. అప్పటికీ.. ఇప్పటికీ గ్రాఫ్ ఎంతో పెరిగిందని చెప్పాడు. బుమ్రా తమ బలమని.. ఇందులో ఎలాంటి సందేహం లేదని తెలిపాడు.