దుబాయ్: నిరుడు అద్వితీయ ప్రదర్శన కనబర్చిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ.. ఐసీసీ ‘వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్’కు సారథిగా ఎంపికయ్యాడు. స్వదేశంలో జరిగిన వన్డే వరల్డ్‌కప్‌లో సత్తాచాటిన టీమ్ఇండియా.. ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడి రన్నరప్‌తో సరిపెట్టుకోగా.. ఆరుగురు భారత ప్లేయర్లకు ఈ జట్టులో చోటు దక్కింది.
రోహిత్‌తో పాటు కోహ్లీ, గిల్, కుల్దీప్, షమీ, సిరాజ్ వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్‌కు ఎంపికయ్యారు. ఇక ఐసీసీ టెస్టు టీమ్ ఆఫ్ ది ఇయర్లో భారత్ నుంచి రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా చోటు దక్కించుకున్నారు. ఈ జట్టుకు కమిన్స్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.