Rohit Sharma | మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ముంబయిలోని తన అధికారిక నివాసం ‘వర్ష’లో రోహిత్ శర్మను అభినందించారు. ఇటీవల రోహిత్ శర్మ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో ఫడ్నవీస్ అభినందనలు తెలుపుతూ.. భారత క్రికెట్‌కు చేసిన సేవలను ప్రశంసించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఫడ్నవీస్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. రోహిత్ ఇటీవల టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. గత సంవత్సరం టీ20 ప్రపంచ కప్‌లో టైటిల్ గెలిచిన తర్వాత రోహిత్ టీ20 ఇంటర్నేషనల్ నుంచి కూడా రిటైర్ అయ్యాడు. ఇకపై కేవలం వన్డేల్లో మాత్రం కొనసాగనున్నాడు. మే 7న టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు రోహిత్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా రోహిత్ వెల్లడించారు. వచ్చే నెలలో ఇంగ్లాండ్‌తో ప్రారంభమయ్యే ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు ముందు రోహిత్ ఈ నిర్ణయం తీసుకున్నాడు.
రోహిత్‌ను కలిసిన ఫొటోలను షేర్ చేస్తూ ఫడ్నవీస్.. ‘భారత క్రికెటర్ రోహిత్ శర్మకు స్వాగతం. రోహిత్‌ను కలిసి మాట్లాడడం చాలా బాగుంది. టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించడం.. భవిష్యత్‌లో విజయం సాధించేందుకు శుభాకాంక్షలు తెలిపాను’ అంటూ పేర్కొన్నారు. రోహిత్ శర్మ 67 టెస్టుల్లో 40.57 సగటుతో 4,301 పరుగులు చేశాడు. ఇందులో 12 సెంచరీలు, 18 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 2024-25 సీజన్లో రోహిత్ ఫామ్ లేమితో ఇబ్బందులుపడ్డాడు. ఈ సీజన్లో 15 మ్యాచ్‌ల్లో 10.83 సగటుతో 164 పరుగులు మాత్రమే చేయగలిగాడు. బంగ్లాదేశ్, న్యూజిలాండ్‌తో జరిగిన స్వదేశీ సిరీస్‌లో రోహిత్ పేలవమైన ఫామ్‌లో తడబడ్డాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా వేదికగా జరిగిన మూడు టెస్టుల్లోనూ విఫలమైన విషయం తెలిసిందే.
It was great to welcome, meet and interact with Indian cricketer Rohit Sharma at my official residence Varsha. I extended my best wishes to him on his retirement from Test cricket and for continued success in the next chapter of his journey!@ImRo45#Maharashtra #Mumbai… pic.twitter.com/G0pdzj6gQy
— Devendra Fadnavis (@Dev_Fadnavis) May 13, 2025