Rohit Sharma : భారత కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) ఈరోజు అనుకోని అతిథిని కలిశాడు. శ్రీలంక జట్టు(Srilanka Team) వీరాభిమాని అయిన 87 ఏళ్ల పెర్సీ అభయ్శేఖర(Percy Abeysekera) ఇంటికి వెళ్లాడు. అతడితో చాలా సేపు మాట్లాడాడు. అయితే.. ‘అంకుల్ పెర్సీ’గా పాపులర్ అయిన అభయ్శేఖర అనారోగ్యం కారణంగా ఇంటి వద్దే ఉంటున్నాడు. ఒకప్పటిలా గ్రౌండ్‌కు వెళ్లి మ్యాచ్‌లు చూడడం లేదు. ఈ విషయం తెలిసిన హిట్‌మ్యాన్ అతడితో ‘మేము మైదానంలో నిన్ను మిస్ అవుతున్నాం’ అని అన్నాడు. రోహిత్ అతడి ఇంట్లో దిగిన ఫొటోలు, అతడితో ముచ్చటించిన వీడియో వైరల్ అవుతున్నాయి.
రోహిత్ శర్మ సారథ్యలోని భారత జట్టు (Team India) ఆసియా కప్‌లో కీలక సమరానికి సిద్దమవుతోంది. దాయాది పాకిస్థాన్(Pakistan)తో సూపర్ 4 ఫైట్(Super 4 Fight)లో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ హై టెన్షన్ మ్యాచ్‌లో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) ఆడనున్నాడు. నేపాల్‌తో మ్యాచ్‌కు ముందు స్వదేశానికి వచ్చిన యార్కర్ కింగ్ మళ్లీ జట్టుతో కలిశాడు.
Indian captain meeting the biggest Sri Lankan fan ever at his home…!!!
– Rohit, humble as ever. pic.twitter.com/DQeAoMd0bN
— Johns. (@CricCrazyJohns) September 8, 2023
తొలి రెండు మ్యాచ్‌లకు దూరమైన కేఎల్ రాహుల్(KL Rahul) నెట్స్‌లో చెమటోడ్చాడు. పూర్తి ఫిట్నెస్ సాధించిన అతను పాక్‌పై బరిలోకి దిగే అవకాశం ఉంది. వర్షం ముప్పు పొంచి ఉన్న నేపథ్యలో ఈ మ్యాచ్‌కు నిర్వాహకులు రిజర్వ్ డే కేటాయించారు. ఒకవేళ 10న మ్యాచ్ రద్దయితే సెప్టెంబర్ 11న ఆడిస్తారు.