మెల్బోర్న్: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma).. మెల్బోర్న్లో జరిగిన బాక్సింగ్ డే టెస్టులో ఓపెనర్‌గా బరిలోకి దిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో.. రెండు, మూడవ టెస్టుల్లో అతను లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ చేసిన విషయం తెలిసిందే. మెల్బోర్న్ టెస్టులో కేఎల్ రాహుల్ మూడవ నెంబర్లో బ్యాటింగ్ చేసే ఛాన్సు ఉన్నట్లు ఓ మీడియా రిపోర్టు ద్వారా తెలిసింది. కానీ శుభమన్ గిల్‌కు చెందిన బ్యాటింగ్ ఆర్డర్‌పై ఎటువంటి ప్రకటన ఇంకా రాలేదు. ఈ మ్యాచ్‌కు ఇద్దరు స్పిన్నర్లను దించాలని ఇండియా భావిస్తున్నది. రవీంద్ర జడేజాతో పాటు వాషింగ్టన్ సుందర్ కూడా ఆడే అవకాశం ఉన్నది. ఒకవేళ సుందర్ ప్లేస్ కన్ఫర్మ్ అయితే, అప్పుడు నితీశ్ రెడ్డికి మొండి చెయ్యి చూపాల్సి వస్తుంది.
మరో వైపు ఆస్ట్రేలియా బౌలర్ మిచెల్ స్టార్క్ అరుదైన రికార్డుకు దగ్గరలో ఉన్నారు. మరో అయిదు వికెట్లు తీస్తే, అతను అంతర్జాతీయ క్రికెట్లో ఏడు వందల వికెట్లు తీసిన ఆసీస్ బౌలర్ల జాబితాలో చేరుతాడు. షేన్ వార్న్ 1001, గ్లెన్ మెక్గ్రాగ్ 949, బ్రెట్ లీ 718 వికెట్లు తీసుకున్నారు. 284 అంతర్జాతీయ మ్యాచుల్లో స్టార్క్ మొత్తం 695 వికెట్లు తీసుకున్నాడు.