Rohit Sharma : టీ20 వరల్డ్ కప్ తొలి మ్యాచ్‌లోనే భారత కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) అర్ధ శతకంతో కదం తొక్కాడు. ఐర్లాండ్‌పై 52 పరుగుల వద్ద హిట్‌మ్యాన్ రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగినా.. ఈ మ్యాచ్‌తో అరుదైన ఘనత సాధించాడు. పొట్టి ఫార్మాట్లో 4,000 రన్స్ కొట్టిన మూడో బ్యాటర్‌గా రోహిత్ రికార్డు సృష్టించాడు.
తద్వారా రోహిత్ సహచరుడు విరాట్ కోహ్లీ(Virat Kohli), పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజాం(Babar Azam)ల సరసన చేరాడు. అంతేకాదు అంతర్జాతీయ క్రికెట్లో 19 వేల పరుగుల మైలురాయికి భారత సారథి చేరువలో ఉన్నాడు. ఒకవేళ ఈ ఫీట్ గనుక 19 వేలు కొడితే.. ఈ ఫీట్ సాధించిన 14 బ్యాటర్‌గా మరో రికార్డు ఖాతాలో వేసుకుంటాడు. ప్రస్తుతం విరాట్ 4,038 రన్స్‌తో అగ్రస్థానంలో ఉండగా.. బాబర్ 4,023 పరుగులతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.
కోహ్లీ, బాబర్, రోహిత్
న్యూయార్క్ వేదికగా ఐసీసీ ట్రోఫీ వేటను ఘనంగా మొదలెట్టింది. తొలి పోరులోనే ఆల్‌రౌండ్ షోతో పసికూన ఐర్లాండ్‌ను రోహిత్ సేన చిత్తుగా ఓడించింది. వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా(3/27), బుమ్రా(2/6)లు బంతితో చెలరేగడంతో ప్రత్యర్థిని భారత్ 96 పరుగులకే ఆలౌట్ చేసింది. అటు పిమ్మట స్వల్ప ఛేదనలో సారథి రోహిత్ శర్మ(52 రిటైర్డ్ హర్ట్) అర్ధ సెంచరీతో రఫ్పాడించాడు. వికెట్ కీపర్ రిషభ్ పంత్(36 నాటౌట్) ఫటాఫట్ ఆడి జట్టును గెలిపించాడు.
At his absolute hitting best 💥
Rohit Sharma starts his #T20WorldCup 2024 campaign in style with a @MyIndusIndBank Milestone 🙌#INDvIRE pic.twitter.com/MZY89ZxU7p
— ICC (@ICC) June 5, 2024