Hyderabad | హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసింది. నగరంలో బుధవారం సాయంత్రం కురిసిన వర్షానికి పలుచోట్ల రోడ్లపైకి వర్షపు నీరు చేసింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరద నీటి కారణంగా మాదాపూర్ నుంచి కేపీహెచ్‌బీ, జూబ్లీహిల్స్ నుంచి హైటెక్ సిటీ, గచ్చిబౌలి మార్గంలో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. మాదాపూర్ మైండ్ స్పేస్ సర్కిల్ నుంచి ఐకియా గచ్చిబౌలి బయోడైవర్సిటీ మార్గంలోనూ ట్రాఫిక్ ఆగిపోయింది.
మాసబ్ ట్యాంక్ నుంచి లక్డీకపూల్ వరకు భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఖైరతాబాద్ నుంచి వై జంక్షన్ వరకు ట్రాఫిక్ నిలిచిపోయింది. అమీర్‌పేటలో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. తెలుగుతల్లి ఫ్లైఓవర్ దగ్గర మోకాలి లోతు వరకు నీరు చేరింది. కృష్ణానగర్‌లో ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. పలు కాలనీల్లో డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి.