Redmi A3x | త్వరలో భారత్ సహా గ్లోబల్ మార్కెట్లలోకి రెడ్ మీ ఎంట్రీ లెవల్ ఫోన్.. ఇవీ స్పెషిఫికేషన్స్..?!
Redmi A3x | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రెడ్మీ తన రెడ్మీ ఏ3ఎక్స్ (Redmi A3x) ఫోన్‌ను త్వరలో గ్లోబల్ మార్కెట్లలో ఆవిష్కరించనున్నది.
Redmi A3x | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రెడ్మీ తన రెడ్మీ ఏ3ఎక్స్ (Redmi A3x) ఫోన్‌ను త్వరలో గ్లోబల్ మార్కెట్లలో ఆవిష్కరించనున్నది. అయితే, భారత్ సహా గ్లోబల్ మార్కెట్లలో తన ఎంట్రీ లెవల్ ఫోన్ ఆవిష్కరణ ప్రణాళికను వెల్లడించలేదు. తాజాగా రూపుదిద్దుకున్న రెడ్మీ ఏ3ఎక్స్ (Redmi A3x) ఫోన్ 6.71 అంగుళాల హెచ్డీ+ ఎల్సీడీ స్క్రీన్, యూనిసోక్ టీ 603 ఎస్వోసీ చిప్ సెట్, 8-మెగా పిక్సెల్ డ్యుయల్ రేర్ కెమెరా సెటప్, మూడు కలర్ ఆప్షన్లలో వస్తోంది. 3 జీబీ ర్యామ్ విత్ 64 జీబీ స్టోరేజీ, 4జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్లలో వస్తుంది. అరోరా గ్రీన్, మిడ్ నైట్ బ్లాక్, మిడ్ నైట్ వైట్ కలర్ ఆప్షన్లలో లభిస్తుందని భావిస్తున్నారు. దీని ధర రూ.5,700 ఉంటుందని తెలుస్తోంది. భారత్ మార్కెట్లోకి రెడ్మీ ఏ3 (Redmi A3) తోపాటు రెడ్మీ ఏ3ఎక్స్ (Redmi A3x) ఫోన్ కూడా వస్తుందని సమాచారం.
ఆండ్రాయిడ్ 14 వర్షన్ పై పని చేస్తుందీ రెడ్మీ ఏ3ఎక్స్ (Redmi A3x) ఫోన్. రెండు ప్రధాన ఆండ్రాయిడ్ అప్ డేట్స్, మూడేండ్ల పాటు సెక్యూరిటీ అప్ డేట్స్ అందిస్తుంది. వాటర్ డ్రాప్ స్టైల్ నాచ్ డిస్ ప్లేతోపాటు 500 నిట్స్ లోకల్ పీక్ బ్రైట్ నెస్ కలిగి ఉంటుంది. ఒక్టాకోర్ యూనిసోక్ టీ 603 ఎస్వోసీ ప్రాసెసర్ తో వస్తోంది. 4జీబీ ర్యామ్ ఇన్ బిల్ట్‌గా అందుబాటులోకి వస్తున్న ఈ ఫోన్లో వర్చువల్ గా 8 జీబీ ర్యామ్ వరకూ పొడిగించుకోవచ్చు. మైక్రో ఎస్డీ కార్డు సాయంతో ఫోన్ స్టోరేజీ కెపాసిటీని ఒక టిగా బైట్ వరకూ పెంచుకోవచ్చు. క్యూవీజీఏ సెన్సర్ తోపాటు 8-మెగా పిక్సెల్ రేర్ కెమెరా, సెల్ఫీలూ వీడియోకాల్స్ కోసం 5-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంటాయి.
రెడ్మీ ఏ3ఎక్స్ (Redmi A3x) ఫోన్ వై-ఫై, బ్లూటూత్ 4.2, జీపీఎస్, గ్లోనాస్, గెలీలియో, 3.5 ఎంఎం ఆడియో జాక్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ కనెక్టివిటీ కలిగి ఉంటుంది. బయో మెట్రిక్ అథంటికేషన్ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్, ఏఐ బేస్డ్ ఫేక్ అన్ లాక్ ఫీచర్‌కు మద్దతుగా నిలుస్తుంది. యాక్సెలరో మీటర్, వర్చువల్ అంబియెంట్ లైట్ సెన్సర్, ఈ-కంపాస్, ప్రాగ్జిమిటీ సెన్సర్ కూడా ఉంటాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

