Rohit Sharma | టీమిండియా కొత్త కెప్టెన్ రోహిత్ శర్మపై మాజీ దిగ్గజం, స్పిన్నర్ హర్భజన్ సింగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. భజ్జీకి నచ్చిన బ్యాటర్ ఎవరు అన్న ప్రశ్నకు ఈ వెటరన్ స్పిన్నర్ బదులిచ్చాడు. తన ఫేవరెట్ బ్యాటర్‌గా రోహిత్ శర్మ పేరు చెప్పాడు.
అలాగే ప్రపంచ క్రికెట్లో రోహిత్ శర్మ అత్యుత్తమ బ్యాటర్ అని కితాబిచ్చాడు. మిగతా వారితో పోలిస్తే రోహిత్ మరో స్థాయిలో ఉంటాడని చెప్పాడు. అదే సమయంలో తనకు నచ్చిన బౌలర్‌గా భారత నయా స్పీడ్‌గన్ జస్ప్రీత్ బుమ్రా పేరు చెప్పాడు. బుమ్రా కూడా మిగతా వారి కన్నా మరో మెట్టు పైనే ఉంటాడన్నాడు.
కాగా, విరాట్ కోహ్లీని వన్డే కెప్టెన్‌గా తొలగించిన బీసీసీఐ.. రోహిత్ శర్మకు ఆ పగ్గాలు అందించిన సంగతి తెలిసిందే. వెస్టిండీస్‌తో జరిగే వన్డే సిరీస్‌లో భారత్‌కు రోహితే నాయకత్వం వహిస్తాడు.