కోదాడ, సెప్టెంబర్ 26 : బీఆర్ఎస్ కోదాడ పట్టణ నాయకుడు, విశ్రాంత ఉద్యోగి కుక్కడం వెంకటేశ్వర్లు మృతి పార్టీకి తీరని లోటు అని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. కోదాడలో శనివారం వెంకటేశ్వర్లు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వెంకటేశ్వర్లు కల్మషం లేని వ్యక్తిత్వంతో అందరితో స్నేహపూర్వకంగా మెలిగేవారు అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో క్లిష్ట పరిస్థితుల్లో కౌన్సిలర్‌గా పోటీ చేయమనగానే వెనుక ముందు ఆలోచించకుండా పార్టీ పక్షాన ఎన్నికల బరిలో నిలిచారన్నారు. ఎన్నికల సమయంలో కొందరు భయభ్రాంతులకు గురిచేసినప్పటికీ మొక్కవోని ధైర్యంతో నిలిచారన్నారు. వ్యక్తిగతంగా తాను, పార్టీ వెంకటేశ్వర్లు కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామన్నారు. ఈ సంతాప కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు నయీమ్, కుక్కడపు బాబు, పిట్టల భాగ్యమ్మ, గొర్రె రాజేష్, చలిగంటి వెంకట్, ఉపేందర్ గౌడ్, బత్తుల ఉపేందర్, కరీముల్లా, బాబా, మజార్, పట్టణ నాయకులు పాల్గొన్నారు.