Gyanesh Kumar | ఓటరు జాబితాను ప్రక్షాళన చేసినందుకు.. జ్ఞానేష్ కుమార్ ‘పద్మభూషణ్’కు అర్హులు: బెంగాల్ బీజేపీ చీఫ్
Gyanesh Kumar | ఓటరు జాబితాను ప్రక్షాళన చేసినందుకు ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్, పద్మభూషణ్‌కు అర్హులని పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సమీక్ భట్టాచార్య అన్నారు. రాష్ట్రంలో హింసారహితంగా అసెంబ్లీ ఎన్నికలు జరిగేలా ఆయన చర్యలు చేపట్టారని కొనియాడారు.
కోల్‌కతా: ఓటరు జాబితాను ప్రక్షాళన చేసినందుకు ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్, పద్మభూషణ్‌కు అర్హులని పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సమీక్ భట్టాచార్య అన్నారు. రాష్ట్రంలో హింసారహితంగా అసెంబ్లీ ఎన్నికలు జరిగేలా ఆయన చర్యలు చేపట్టారని కొనియాడారు. (Gyanesh Kumar) ప్రత్యేక విస్తృత ఓటరు జాబితాల సవరణ (సర్) ప్రక్రియపై ఇద్దరు ఎన్నికల కమిషనర్లు అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ, సీఈసీ జ్ఞానేష్ కుమార్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నట్లు వార్తా కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సీఈసీపై విమర్శలు రావడంతో పాటు ఆయన రాజీనామా చేయాలన్న డిమాండ్లు ఊపందుకున్నాయి.
కాగా, ఈ వివాదం నేపథ్యంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్‌ను బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సమీక్ భట్టాచార్య ప్రశంసలతో ముంచెత్తారు. భారతదేశపు మూడవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్ ఆయనకు ఇవ్వాలని ప్రతిపాదించారు. ‘జ్ఞానేష్ కుమార్ కనీసం ‘పద్మ భూషణ్’ పురస్కారానికైనా అర్హులు. చాలా కాలం తర్వాత బెదిరింపులకు తావులేకుండా, ఎన్నికల సమయంలో ఎలాంటి హత్యలు జరుగకుండా, ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేలా పరిస్థితులు ఉండటం పట్ల పశ్చిమ బెంగాల్ ప్రజలు సంతోషంగా ఉన్నారు’ అని అన్నారు.
మరోవైపు బెంగాల్‌లోని ఓటర్ల జాబితాను ‘ప్రక్షాళన’ చేయడంలో సీఈసీ జ్ఞానేష్ కుమార్ కీలక పాత్ర పోషించారని సమీక్ భట్టాచార్య తెలిపారు. పశ్చిమ బెంగాల్ వంటి సరిహద్దు రాష్ట్రంలో ఓటర్ల జాబితా నుంచి బంగ్లాదేశ్ చొరబాటుదారుల పేర్లను తొలగించే విషయంలో ఆయన చొరవ తీసుకున్నారంటూ కొనియాడారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harsha Chemudu | ట్రెండింగ్‌లో ‘లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’.. దర్శకుడికి ఖరీదైన బైక్ బహుమతిగా ఇచ్చిన హర్ష చెముడు!
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ విధ్వంసం.. తొలి రోజే రూ.125 కోట్లకు పైగా వసూళ్లు!
Regime Change: అధికార మార్పిడి జరగాలన్న ప్రశాంత్ భూషణ్.. ఆ వ్యాఖ్యలను వ్యతిరేకించిన అభిజీత్ దీప్కే
90 Hours Fasting | 90 గంటల పాటు నిరంతరాయంగా ఉపవాసం ఉండడం సాధ్యమేనా.. డాక్టర్లు ఏమంటున్నారు..?
Parliament: డీలిమిటేషన్, వుమెన్స్ కోటా బిల్లులు.. ఈనెలలోనే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

