T20 World Cup 2024 : టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) రికార్డు బద్ధలు కొట్టేశాడు. సెయింట్ లూయిస్‌లో ఆస్ట్రేలియా బౌలర్లను ఊచకోత కోసిన హిట్‌మ్యాన్ 19 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించాడు. ప్యాట్ కమిన్స్ వేసిన 5 ఓవర్లో సిక్స్, ఫోర్, సింగిల్ తీసిన రోహిత్ యాభైకి చేరువయ్యాడు. దాంతో, తొమ్మిదో సీజన్లో వేగవంతమైన ఫిఫ్టీ నమోదు చేశాడు.
రోహిత్ విధ్వంసంతో క్వింటన్ డికాక్(దక్షిణాఫ్రికా), అరోన్ జోన్స్(యూఎస్ఏ) పేరిట ఉన్న రికార్డు బద్దలైంది. టోర్నీ ఆరంభ పోరులో కెనడాపై జోన్స్ 22 బంతుల్లో యాభై కొట్టగా.. ఇంగ్లండ్‌పై డికాక్ సైతం 22 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. దాంతో, భారత జట్టు స్కోర్ రాకెట్ వేగంతో పరుగెట్టింది.