గౌహతి: ఇండియన్ క్రికెట్ కెప్టెన్ రోహిత్ శర్మ మళ్లీ మైదానంలోకి దిగాడు. శ్రీలంకతో ఇవాళ ప్రారంభంకానున్న వన్డే సిరీస్‌లో అతను ఆడనున్నాడు. అయితే గౌహతిలో సోమవారం ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో ఓ ఘటన జరిగింది. నెట్ ప్రాక్టీస్ తర్వాత రోహిత్ తన అభిమానుల్ని కలిశాడు. తన అభిమాన రోహిత్‌ను చూసిన ఓ కుర్రాడు కన్నీరు పెట్టుకున్నాడు. ఆ సమయంలో ఆ బాలుడి దగ్గరకు వెళ్లి అతన్ని ఓదార్చాడు రోహిత్. ఆ తర్వాత కొందరు అభిమానులకు ఆటోగ్రాఫ్ కూడా ఇచ్చాడు.
Cricketer Rohit Sharma interacting with an young cricket fan from Assam in Guwahati.
Adorable Moments!@ImRo45 pic.twitter.com/Nyzc4D9fHg
— Pramod Boro (@PramodBoroBTR) January 9, 2023
డిసెంబర్లో బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే సిరీస్ నుంచి రోహిత్ ఆటకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. బంగ్లాదేశ్‌తో జరిగిన రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌కు కూడా అతను దూరం అయ్యాడు. శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌లోనూ అతను ఆడలేదు. ఇవాళ లంకతో జరిగే వన్డే సిరీస్‌కు మళ్లీ రోహిత్ బాధ్యతలు చేపట్టనున్నాడు.
Nets ✅
Fan meet-ups 😃 ✅#TeamIndia skipper @ImRo45 is all geared-up for #INDvSL ODI series opener 💪🏻 @mastercardindia pic.twitter.com/o6SOrUblBg— BCCI (@BCCI) January 9, 2023