ODI Team Of The Year : వన్డేల్లో వీరకొట్టుడుతో అభిమానులను అలరిస్తున్న భారత క్రికెటర్లు రోహిత్ శర్మ(Rohit Sharma), విరాట్ కోహ్లీ (Virat Kohli) ‘ఈఎస్పీఎన్ వన్డే జట్టు 2025′(ESPN ODI Team Of The Year 2025)కు ఎంపికయ్యారు. నిరుడు టీమిండియాకు ఛాంపియన్స్ ట్రోఫీ అందించిన హిట్‌మ్యాన్‌కు కెప్టెన్సీ దక్కగా.. దక్షిణాఫ్రికాపై శతకాలతో రెచ్చిపోయిన కోహ్లీ బ్యాటింగ్ ఆర్డర్లో మూడో స్థానం కాపాడుకున్నాడు. 2025లో వన్డేల్లో అద్భుతంగా రాణించిన 11 మందితో గురువారం ఈఎస్పీఎన్ జట్టును ప్రకటించింది. అందులో భారత్ నుంచి రో-కోకు మాత్రమే చోటు దక్కింది.
వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్ లక్ష్యంగా చెలరేగిపోతున్న భారత సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు ఈఎస్పీఎయన్ జట్టులో చోటు సంపాదించారు. కెప్టెన్, ఓపెనర్‌గా రోహిత్ ఎంపికవ్వగా.. అతడికి జోడీగా దక్షిణాఫ్రికా కుర్రాడు మాథ్యూ బ్రీట్ట్ను తీసుకున్నారు. మూడో స్థానంలో కోహ్లీ, నాలుగో స్థానానికి జో రూట్ సెలెక్ట్ అయ్యారు.
నిరుడు సెంచరీలతో రెచ్చిపోయిన విండీస్ కెప్టెన్ షాయ్ హోప్ వికెట్ కీపర్‌గా ఎంపికయ్యాడు. న్యూజిలాండ్ క్రికెటర్ గ్లెన్ ఫిలిప్స్ స్పిన్ ఆల్‌రౌండర్‌గా చోటు దక్కించుకున్నాడు. మిచెల్ శాంట్నర్, హ్యాట్ హెన్రీ(న్యూజిలాండ్) బౌలింగ్ యూనిట్లో నిలిచారు. ఇంగ్లండ్ స్టార్లు ఆదిల్ రషీద్ స్పిన్నర్‌గా, జోఫ్రా ఆర్చర్, జైడెన్ సీల్స్(వెస్టిండీస్) పేస్ బౌలర్లుగా వన్డే జట్టు ఆఫ్ ది ఇయర్ 2025కు ఎంపికయ్యారు.
వన్డే జట్టు ఆఫ్ ది ఇయర్ 2025 : రోహిత్ శర్మ(కెప్టెన్), మాథ్యూ బ్రీట్జ్, విరాట్ కోహ్లీ, జో రూట్, షాయ్ హోప్(వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ శాంట్నర్, ఆదిల్ రషీద్, జోఫ్రా ఆర్చర్, మ్యాట్ హెన్రీ, జైడెన్ సీల్స్.
Our ODI XI from a World Cup year 💪 pic.twitter.com/5nGWAH1YYz
— ESPNcricinfo (@ESPNcricinfo) December 31, 2025
మహిళల వన్డే జట్టు 2025లో ఏకంగా నలుగురు భారత క్రికెటర్లు ఉన్నారు. వన్డే వరల్డ్‌కప్‌లో చెలరేగి ఆడిన స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రీచా ఘోష్‌లు తుది జట్టులో నిలిచారు. సంచలన ఇన్నింగ్స్‌లతో దక్షిణాఫ్రికాను ఫైనల్ చేర్చిన లారా వొల్వార్డ్త్ ఈ జట్టుకు కెప్టెన్‌గా ఎంపికైంది.
మహిళల వన్డే జట్టు2025 : స్మృతి మంధాన, లారా వొల్వార్డ్(కెప్టెన్), జెమీమా రోడ్రిగ్స్, మరినే కాప్, అష్ గార్డ్నర్, దీప్తి శర్మ, రీచా ఘోష్(వికెట్ కీపర్), నడినే డీక్లెర్క్, ఫాతిమా సనా, అలనా కింగ్, సోఫీ ఎకిల్‌స్టోన్.