IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో ముంబై ఇండియన్స్(Mumbai Indians) జోరు కొనసాగుతోంది. ఓటమితో సీజన్‌ను మొదలెట్టిన ముంబై.. వరుసగా నాలుగో విజయంతో ప్లే ఆఫ్స్ రేసులోకి దూసుకొచ్చింది. బుధవారం సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH)ను పాండ్యా సేన 7 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. కమిన్స్ బృందం తడబడిన చోట ముంబై ఓపెనర్ రోహిత్ శర్మ(70) ఖతర్నాక్ బ్యాటింగ్ చేశాడు. 36 బంతుల్లోనే అర్ధ శతకం సాధించాడు. సూర్యకుమార్ యాదవ్(40 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. జీషన్ బౌలింగ్‌లో మిస్టర్ 360 రెండు బౌండరీలతో ముంబైకి ఐదో విజయాన్ని కట్టబెట్టాడు. దాంతో.. ముంబై మూడో స్థానానికి ఎగబాకగా.. ఆరెంజ్ ఆర్మీ 9వ స్థానంలోనే ఉండిపోయింది.
సన్‌రైజర్స్‌ను 143 పరుగులకే కట్టడి చేసిన ముంబై ఇండియన్స్‌కు శుభారంభం దక్కలేదు. ఫామ్‌లో ఉన్న ఓపెనర్ రియాన్ రికెల్టన్(11)ను జయాద్కాట్ రిటర్న్ క్యాచ్‌తో వెనక్కి పంపాడు. ఆ తర్వాత విల్ జాక్స్(22) అండగా రోహిత్ శర్మ(70) ఆరెంజ్ ఆర్మీ బౌలర్లను ఉతికేశాడు. ఈ ఇద్దరూ ఫోర్లు, సిక్సర్లతో చెలరేగగా ముంబై 6 ఓవర్లలోనే 56 పరుగులు చేసింది. ముంబైని గెలుపు దిశగా నడిపిస్తున్న ఈ జోడీని జీషన్ విడదీశాడు. ధాటిగా ఆడుతున్న జాక్స్‌ను పెవిలియన్ పంపాడు. దాంతో, 77 వద్ద రెండో వికెట్ పడింది.
ℝ𝕆 🤜🤛 𝕎𝕀𝕃𝕃 put up a show in Hyderabad 🔥
A solid 64-run partnership for the two 🙌#MumbaiIndians #PlayLikeMumbai #TATAIPL #SRHvMI pic.twitter.com/VP4WQDp7hs
— Mumbai Indians (@mipaltan) April 23, 2025
అనంతరం సూర్యకుమార్ యాదవ్(40).. తన మార్క్ షాట్లతో అలరిస్తూ లక్ష్యాన్ని కరిగించాడు. అర్ధ శతకం తర్వాత జోరు పెంచిన రోహిత్.. విజయానికి 14 పరుగుల దూరంలో ఔటయ్యాడు. తిలక్ వర్మ(2)తో కలిసి సూర్య లాంఛనం ముగించాడు. జీషన్ వేసిన 16వ ఓవర్లో రెండు ఫోర్లతో ముంబైని గెలిపించాడు. దాంతో, పాండ్యా సేన వరుసగా నాలుగో విజయంతో 10 పాయింట్లు సాధించింది.
4️⃣th consecutive win for the @mipaltan 👌
They make it 2️⃣ in 2️⃣ against #SRH this season 👏
Scorecard ▶ https://t.co/nZaVdtwDtv #TATAIPL | #SRHvMI pic.twitter.com/wZMMQnOEi0
— IndianPremierLeague (@IPL) April 23, 2025
పద్దెనిమిదో సీజన్లో అనిశ్చితికి కేరాఫ్‌గా మారిన సన్‌రైజర్స్ భారీ మూల్యం చెల్లించుకుంది. కీలకపోరులో ముంబై ఇండియన్స్ చేతిలో చిత్తుగా ఓడిపోయింది. మొదట ముంబై పేసర్ల ధాటికి టాపార్డర్ విఫలంకావడంతో.. 35 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన ఆరెంజ్ ఆర్మీని హెన్రిచ్ క్లాసెన్(71) ఆదుకున్నాడు.
I.C.Y.M.I
MAXIMUM 🙌 & GONE ☝
Heinrich Klaasen played a superb knock of 71(44) 👍
Jasprit Bumrah completed his 3️⃣0️⃣0️⃣th T20 wicket 👏
Scorecard ▶ https://t.co/nZaVdtxbj3 #TATAIPL | #SRHvMI | @SunRisers | @Jaspritbumrah93 pic.twitter.com/zD4pOlknsy
— IndianPremierLeague (@IPL) April 23, 2025
ఒత్తిడిలోనూ ఖతర్నాక్ హాఫ్ సెంచరీ బాదిన అతడు ఇంప్యాక్ట్ ప్లేయర్ అభినవ్ మనోహర్(43)తో కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. క్రీజులో పాతుకుపోయిన ఈ ఇద్దరూ.. ముంబై బౌలర్లపై విరుచుకుపడుతూ ఐదో వికెట్‌కు 99 రన్స్ జోడించారు. దాంతో, వందలోపే కుప్పకూలేలా కనిపించిన సన్‌రైజర్స్ నిర్ణీత ఓవర్లలో7 వికెట్ల నష్టానికి 143 పరుగులు స్కోర్ చేయగలిగింది.