IPL 2025 | ఉగ్రదాడి మృతులకు నివాళి.. నల్ల రిబ్బన్లు ధరించిన క్రికెటర్లు
IPL 2025 : పహల్గామ్ ఉగ్రదాడి మృతులకు యావత్ భారతం నివాళులు అర్పిస్తోంది. ఐపీఎల్ మ్యాచ్ సమయంలో క్రికెటర్లు సైతం నల్ల బ్యాడ్జీల(Black Badges)తో సంతాపం తెలిపారు.
IPL 2025 : పహల్గామ్ ఉగ్రదాడి మృతులకు యావత్ భారతం నివాళులు అర్పిస్తోంది. 26మంది అమాయకులను పొట్టనబెట్టుకున్న ముష్కర దాడిని ఖండిస్తూ.. పలునగరాల్లో బాధిత కుటుంబాలకు సంఘీభావం తెలియజేస్తున్నారు. ఐపీఎల్ మ్యాచ్ సమయంలో క్రికెటర్లు సైతం నల్ల బ్యాడ్జీల(Black Badges)తో సంతాపం తెలిపారు.
ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్, ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు చేతులకు బ్లాక్ రిబ్బన్లు కట్టుకున్నారు. మ్యాచ్ అంపైర్లు, రిఫరీలు సైతం వీళ్లను అనుసరించారు. మ్యాచ్ ప్రారంభానికి ముందు మైదానంలో
ఒక నిమిషం పాటు మృతులకు నివాళులు అర్పించారు. ఇరుజట్ల కోచింగ్ సిబ్బంది, కామెంటేటర్లు సైతం నల్ల రిబ్బన్లతో నివాళులు అర్పించారు. స్టేడియంలోని అభిమానులు కూడా లేచి నిల్చొని సంతాపం తెలిపారు. అనంతరం మ్యాచ్ యథావిధిగా రాత్రి 7:30 గంటలకుప్రారంభమైంది.
Let’s all stand for peace and humanity.
A minute’s silence was observed in Hyderabad to pay respect to the victims of Pahalgam terror attack.
All the players, support staff, commentators & match officials are wearing black armbands for tonight’s game. #TATAIPL | #SRHvMI pic.twitter.com/PIVOrIyexY
— IndianPremierLeague (@IPL) April 23, 2025
ఇది ఏరకమైన యుద్ధం
భారత క్రికెటర్లు పలువురు ఇప్పటికే ఎక్స్ వేదికగా పహల్గామ్ దాడిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ పోస్ట్‌లు పెట్టారు. పేసర్ మహ్మద్ సిరాజ్(Mohammad Siraj) సైతం తన ఆవేదనను పంచుకున్నాడు. ‘ఇది అసలు ఏరకమైన యుద్ధం. మనుషుల ప్రాణాలకు విలువన్నదే లేకుండా పోయింది’ అంటూ స్పీడ్‌స్టర్ తన ఎక్స్ పోస్ట్‌లో రాసుకొచ్చాడు.
‘పహల్గామ్లో ఉగ్రవాదులు జరిపిన భయంకరమైన దాడి గురించి తెలిసి షాకయ్యాను. మతం పేరుతో అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకోవడం, వాళ్లను చంపడం అనేది హేయమైన చర్య. ఇలాంటి క్రూరమైన చర్యలను ఏ సిద్ధాంతమూ అంగీకరంచదు. ఇది ఏ రకమైన యుద్ధం. మనుషుల ప్రాణాలకు ఎలాంటి విలువ లేకుండా పోతోంది. పహల్గామ్ దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాల్లో నిండిన విషాదం.. వాళ్లు పడుతున్న బాధను నేను ఊహించలేకపోతున్నాను’ అని సిరాజ్ తన ఆక్రోషాన్ని, ఆవేదనను వెల్లగక్కాడు.
Just read about the horrific and shocking terrorist attack in Pahalgam.
To target and kill innocent civilians in the name of religion is pure evil…
No cause, no belief, no ideology can ever justify such a monstrous act.Yeh kaisi ladai hai… pic.twitter.com/nP5LKpT94E— Mohammed Siraj (@mdsirajofficial) April 23, 2025
ఇవి కూడా చదవండి
- IPL 2025 | ఫిక్సింగ్ ఆరోపణలపై గరంగరం.. ప్రభుత్వానికి ఫిర్యాదు
- Srisailam | శ్రీశైల క్షేత్ర చారిత్రక సంపద పరిరక్షణకు చర్యలు తీసుకోండి.. ఆలయ ఈవో ఆదేశాలు
- విత్తనాలు, ఎరువులు అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు తప్పవు : వ్యవసాయాధికారి
- IPL 2025 | ఆపద్భాందవులైన క్లాసెన్, అభినవ్.. స్వల్ప లక్ష్యాన్ని సన్‌రైజర్స్ కాపాడుకునేనా..?
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

