IPL 2025 : అనిశ్చితికి కేరాఫ్‌గా మారిన సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) సొంతమైదానంలో తడబడినా.. ఆఖరికి పోరాడగలిగే స్కోర్ చేసింది. ముంబై ఇండియన్స్(Mumbai Indians) పేసర్ల ధాటికి టాపార్డర్ మరోసారి విఫలంకావడంతో.. 35 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన ఆరెంజ్ ఆర్మీని హెన్రిచ్ క్లాసెన్(71) ఆదుకున్నాడు. ఒత్తిడిలోనూ ఖతర్నాక్ హాఫ్ సెంచరీ బాదిన అతడు ఇంప్యాక్ట్ ప్లేయర్ అభినవ్ మనోహర్(43)తో కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. క్రీజులో పాతుకుపోయిన ఈ ఇద్దరూ.. ముంబై బౌలర్లపై విరుచుకుపడుతూ ఐదో వికెట్‌కు 99 రన్స్ జోడించారు. దాంతో, వందలోపే కుప్పకూలేలా కనిపించిన సన్‌రైజర్స్ నిర్ణీత ఓవర్లలో7 వికెట్ల నష్టానికి 143 పరుగులు స్కోర్ చేయగలిగింది.
ఉప్పల్ స్టేడియంలో టాస్ ఓడిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను బ్యాటింగ్‌కు దిగింది. ఇంకేముంది పరుగుల విందే అనుకున్నారు స్టేడియంలోని, టీవీల ముందు అభిమానులు. కానీ, రెండో ఓవర్లోనే కథ అడ్డం తిరిగింది. విధ్వంసక ఓపెనర్ ట్రావిస్ హెడ్(0)ను బౌల్ట్ డకౌట్‌గా వెనక్కి పంపాడు. ఆ తర్వాత వచ్చిన ఇషాన్ కిషన్(1) సైతం దీపక్ చాహర్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ రికెల్టన్ చేతికి చిక్కాడు. ఆ షాక్ నుంచి తేరుకునే లోపే.. అభిషేక్ శర్మ(8), నితీశ్ కుమార్ రెడ్డి(2)లు పేలవ షాట్లతో పెవిలియన్‌కు క్యూ కట్టారు. దాంతో, 14 పరుగులకే కమిన్స్ సేన నలుగురు ప్రధాన ఆటగాళ్ల వికెట్లు కోల్పోయింది.
Innings Break!
Crucial partnership from Heinrich Klaasen and Abhinav Manohar 🤝#MI chase on the other side.
Scorecard ▶ https://t.co/nZaVdtxbj3 #TATAIPL | #SRHvMI pic.twitter.com/fYByhcsTlV
— IndianPremierLeague (@IPL) April 23, 2025
గత మ్యాచ్‌లో చెలరేగి ఆడిన కుర్రాడు అనికేత్ వర్మ(12),, హెన్రిచ్ క్లాసెన్(71) జతగా రెచ్చిపోతాడులే అనుకున్న ఆరెంజ్ ఆర్మీ ఆశ ఫలించలేదు. బుమ్రా ఓవర్లో ఫోర్ కొట్టిన అనికేత్ లెగ్ సైడ్ ఆడబోయి కీపర్‌కు క్యాచ్ ఇచ్చాడు. అంతే.35 వద్ద ఐదో వికెట్.. దాంతో.. కమిన్స్ సేన 50లోపే ఆలౌట్ అయ్యేలా కనిపించింది. ఐపీఎల్ చరిత్రలో 49 రన్స్‌కే ఆలౌట్ అయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రికార్డును బ్రేక్ చేస్తుందనపించింది. కానీ, క్లాసెన్ అలా జరగనీయలేదు.
ఓవైపు వికెట్లు పడుతున్నా క్లాసెన్ ఒంటరి సైనికుడిలా పోరాడాడు. ఇంప్యాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన అభినవ్ మనోహర్(43) ఓపికగా క్రీజులో నిలబడి క్లాసెన్‌కు చక్కని సహకారం అందించాడు. 10 ఓవర్ల తర్వాత రెచ్చిపోయిన క్లాసెన్ బౌండరీతో అర్థ శతకం సాధించాడు. ఆ తర్వాత కూడా బుమ్రా బౌలింగ్‌లో అభినవ్ ఫోర్ బాదడంతో సన్‌రైజర్స్ స్కోర్ వంద దాటింది.
Upping the ante.
Heinrich Klaasen and Abhinav Manohar on the move 👌
A fighting 34-ball FIFTY from Heinrich Klaasen 👏
Updates ▶ https://t.co/nZaVdtxbj3 #TATAIPL | #SRHvMI | @SunRisers pic.twitter.com/6waLHTurl5
— IndianPremierLeague (@IPL) April 23, 2025
పాండ్యా వేసిన 18వ ఓవర్లో మనోహర్ స్ట్రెయిట్‌గా సిక్సర్ సంధించాడు. ఐదో వికెట్‌కు 99 పరుగుల విలువైన భాగస్వామ్యం నెలకొల్పి.. పరువు కాపాడారు. బుమ్రా బౌలింగ్‌లో సిక్సర్ బాదిన క్లాసెన్.. ఆ తర్వాత బంతికే ఔటయ్యాడు. బౌల్ట్ వేసిన ఆఖరి ఓవర్లో మనోహర్, కమిన్స్ బౌల్డ్ కావడంతో సన్‌రైజర్స్ 7 వికెట్ల నష్టానికి 142 రన్స్ చేయగలిగింది. ముంబై బౌలర్లలో బౌల్ట్ 4, దీపక్ చాహర్ రెండు వికెట్లు పడగొట్టారు.