Team India | ఈ ఏడాది జూన్‌లో వెస్టిండిస్, అమెరికా వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్‌ని టీమిండియా కైవసం చేసుకున్నది. ఆ తర్వాత టీ20 క్రికెట్‌కు కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరు వీడ్కోలు పలికారు. ప్రస్తుతం ఇద్దరు సీనియర్ క్రికెటర్ల కెరీర్‌పై చర్చ సాగుతున్నది. ఇప్పటికే పలువురు మాజీలు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. తాజాగా టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ సైతం అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. కోహ్లి మరో ఐదేళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్ ఆడగలగడని.. రోహిత్ వచ్చే ఏడాది వరకు క్రికెట్‌ను ఎంజాయ్ చేయగలడని హర్భజన్ అభిప్రాయపడ్డాడు.
రోహిత్ మరో రెండేళ్లు సులభంగా ఆడగలడని హర్భజన్ తెలిపాడు. విరాట్ కోహ్లి ఫిట్నెస్ను ఎవరితోనూ పోల్చలేరని.. ఐదేళ్లు ఆడడం చూడవచ్చని చెప్పాడు. అతను జట్టులో అతను అత్యుత్తమ ఆటగాడు అని పేర్కొన్నాడు. ఫిట్నెస్ పరంగా విరాట్‌తో పోటీపడమని 19 ఏళ్ల వయసుగల వారిని అగడవచ్చని.. అతన్ని కూడా విరాట్ ఓడిస్తాడని.. అంత ఫిట్‌గా ఉన్నాడని చెప్పాడు. విరాట్, రోహిత్‌లకు ఇంకా చాలా క్రికెట్ మిగిలి ఉందని.. ఎంతకాలం ఆడాలనుకుంటున్నారనేది పూర్తిగా వారి అభిప్రాయంపైనే ఆధారపడి ఉంటుందని చెప్పాడు. ఇద్దరూ ఫిట్‌గా ఉండి, తమ ప్రదర్శనతో జట్టు విజయానికి సహకరిస్తే ఆటను కొనసాగించాలని చెప్పాడు.
టెస్టు క్రికెట్లో భారత జట్టుకు ఇద్దరి అవసరం ఉందని మాజీ స్పిన్నర్ తెలిపాడు. రెడ్ బాల్ ఫార్మాట్, పరిమిత ఓవర్ల క్రికెట్ అయినా.. ఏఫార్మాట్లలో అయినా అనుభవం అవసరమని అభిప్రాపడ్డాడు. యువ ఆటగాళ్లు ప్రతిభను పెంచుకునేందుకు అనుభజ్ఞులైన క్రికెటర్లు అవసరమని.. ఒక ఆటగాడు నిలకడగా రాణించలేకపోతే జట్టు నుంచి తప్పుకోవాలని హర్భజన్ పేర్కొన్నారు. ఏ ఆటగాడు రాణించలేకపోతున్నాడో సెలక్టరేట్లు చూడాలని.. సీనియర్, జూనియర్ అయినా జట్టు నుంచి తప్పించాల్సిందేనని చెప్పాడు.
సీనియర్ ఆటగాళ్ల కంటే యువతలోనే ఎక్కువగా ఆకలి ఉంటుందని హర్భన్ అభిప్రాయపడ్డాడు. ఎందుకంటే యువ క్రికెటర్లు తమను తాము స్థిరపరచుకోవాలి. సీనియర్ ఆటగాళ్ల కంటే యువతలో ఎక్కువ ఉత్సాహం, అభిరుచి ఉంటుందని తాను నమ్ముతానని.. 15 సంవత్సరాలుగా మైదానంలో గడిపితే కాస్త ఆకలి తగ్గుతుంది. రియాన్ పరాగ్కి అవకాశాలు వస్తున్నాయి. యశస్వి జైస్వాల్, శుభమాన్ గిల్ ఆడుతున్న తీరు చూస్తుంటే చాలా బాగుందని తెలిపాడు. శ్రీలంకతో వన్డే సిరీస్‌లో ఓటమిపై స్పందిస్తూ.. దానికి అంత ప్రాధాన్యం ఇవ్వనని స్పష్టం చేశాడు. కొన్ని మ్యాచ్‌లు గెలిచి.. మరికొన్నింటిలో ఓడిపోతామని చెప్పాడు. ఇది కూడా ఒక గేమ్ మాత్రమేనని.. ప్రతి జట్టు అలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పాడు. ఈ విషయంలో తాను శ్రీలంకకు క్రెడిట్ ఇవ్వాలనుకుంటున్నానని.. భారత్ కంటే మెరుగ్గా ఆడిందంటూ చెప్పుకొచ్చాడు.