Rohit – Virat: వాళ్లిద్దరూ మరో ప్రపంచకప్ ఆడాలి.. ‘రోకో’లపై దిగ్గజాల అభిప్రాయమిదే..
Rohit – Virat: వయసు, ఇతరత్రా కారణాల రీత్యా వీళ్లు 2027లో జరుగబోయే వన్డే ప్రపంచకప్ ఆడేది అనుమానమే అయినా కనీసం వచ్చే టీ20 వరల్డ్ కప్ వరకైనా ఆడాలని దిగ్గజ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు.
Rohit – Virat: టీమిండియా సీనియర్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ (రోకో) లు చివరి వరల్డ్ కప్ ఆడేశారా..? భారత్ వేదికగా ఇటీవలే ముగిసిన వన్డే ప్రపంచకప్ – 2023 తర్వాత అభిమానుల్లో ఇదే చర్చ సాగుతోంది. వయసు, ఇతరత్రా కారణాల రీత్యా వీళ్లు 2027లో జరుగబోయే వన్డే ప్రపంచకప్ ఆడేది అనుమానమే అయినా కనీసం వచ్చే టీ20 వరల్డ్ కప్ వరకైనా ఆడాలని దిగ్గజ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. యువ భారత్‌ను నడిపించేందుకు వీళ్ల అనుభవం కావాలని చెబుతున్నారు.
ఇదే విషయమై వసీం అక్రమ్ స్పోర్ట్స్ కీడాతో మాట్లాడుతూ..‘టీ20 వరల్డ్ కప్ మరో ఆరేడు నెలలలో మొదలుకానుంది. నేనైతే ఆ ఇద్దరూ (రోహిత్, కోహ్లీ) ఈ మెగా టోర్నీ ఆడాలని కోరుకుంటున్నా. భారత జట్టుకు ఇప్పుడు వాళ్లిద్దరూ చాలా కీలకం. పొట్టి క్రికెట్లో దూకుడు కంటే అనుభవం కూడా చాలా ప్రధానం. అందరూ యువ ఆటగాళ్లతోనే ఆడితే అది మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంది’ అని అన్నాడు.
భారత మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ స్పందిస్తూ.. ‘అవును, వచ్చే టీ20 వరల్డ్ కప్‌లో ఆ ఇద్దరూ ఆడాలి. అన్నింటికంటే ముఖ్యం ఆ జట్టుకు కూడా రోహితే సారథిగా వ్యవహరించాలి. ప్రస్తుతానికి హార్ధిక్ పాండ్యా భారత జట్టు సారథ్య పగ్గాలు చేపట్టినా టీ20 ప్రపంచకప్‌లో మాత్రం రోహితే ఆ బాధ్యతలు మోయాలి..’ అని తెలిపాడు.
Muralitharan said “Rohit Sharma can play another World Cup, the starts he gave, the kind of strike rates he batted – around 130 strike rate in ODIs, which is not bad for even T20s – he is experienced”. [JioCinema] pic.twitter.com/QshoGZRrsc
— Johns. (@CricCrazyJohns) November 25, 2023
ఇక శ్రీలంక దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ మాట్లాడుతూ.. రోహిత్ మరో వన్డే వరల్డ్ కప్ ఆడే అవకాశముందని అన్నాడు. ఫిట్నెస్ మీద దృష్టి పెడితే హిట్‌మ్యాన్‌కు అదేం పెద్ద విషయం కాదని, ఈ విషయంలో అతడు కోహ్లీని స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించాడు. వన్డే వరల్డ్ కప్‌లో రోహిత్ ప్రదర్శన చూసిన తర్వాత అతడు ఇప్పుడే వన్డేల నుంచి తప్పుకోవాలనుకోవడం ఎంతమాత్రమూ సమంజసం కాదని అన్నాడు. కాగా గతేడాది టీ20 ప్రపంచకప్ ముగిసిన తర్వాత రోహిత్, కోహ్లీలు అంతర్జాతీయ స్థాయిలో ఒక్క టీ20 కూడా ఆడలేదు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

