Mohammad Rizwan : పాకిస్థాన్ వైస్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ (Mohammad Rizwan) మరో ఫీట్ సాధించాడు. పాక్ తరఫున టీ20ల్లో అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్‌గా రిజ్వాన్ చరిత్ర సృష్టించాడు. ఆదివారం న్యూజిలాండ్ (Newzealand)తో జరిగిన రెండో టీ20లో ఈ లెఫ్ట్ హ్యాండర్ ఒక సిక్సర్ బాదాడు. దాంతో పొట్టి ఫార్మాట్లో 77 సిక్సర్లు ఖాతాలో వేసుకున్నాడు. మాజీ కెప్టెన్ మహ్మద్ హఫీజ్() 76 సిక్సర్లతో రెండో స్థానానికి పడిపోయాడు. మాజీ ఆల్‌రౌండర్ షాహీద్ ఆఫ్రిది() 73 సిక్సర్లతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.
పాకిస్థాన్ తరఫున టీ20ల్లో అత్యధిక సిక్సర్ల వీరులు ఎవరంటే..? రిజ్వాన్ 77 సిక్సర్లతో అగ్రస్థానంలో నిలవగా, హఫీజ్ 76తో రెండో స్థానంలో ఉన్నాడు. షాహీద్ ఆఫ్రిది 73, షోయబ్ మాలిక్ 69 సిక్సర్లతో మూడు, నాలుగు స్థానాల్లో నిలిచారు. ఇక మాజీ సారథి బాబర్ ఆజాం 55, ఉమర్ అక్మల్ 55 సిక్సర్లతో ఐదు, ఆరు స్థానాలు దక్కించుకున్నారు.
🚨 RECORD ALERT @iMRizwanPak is now the leading six-hitter for 🇵🇰 in T20Is 💪#NZvPAK | #BackTheBoysInGreen pic.twitter.com/9e71hOuqTj
— Pakistan Cricket (@TheRealPCB) January 14, 2024
ప్రపంచంలోని విధ్వంసక బ్యాటర్లలో ఒకడైన రిజ్వాన్ ఈ మధ్యే వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ప్రస్తుతం న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్‌లో షాహీన్ ఆఫ్రిది(Shaheen Afridi)కి డిప్యూటీగా రిజ్వాన్ వ్యవహరిస్తున్నాడు. ఈ స్టార్ బ్యాటర్ పాక్ తరఫున 86 టీ20లు ఆడాడు. ఒక సెంచరీ, 25 హాఫ్ సెంచరీలతో కలిపి 2,804 పరుగులు సాధించాడు.

నిరుడు ఆస్ట్రేలియా గడ్డపై జరిగిన టీ20 వరల్డ్ కప్‌లో రిజ్వాన్ అద్భుతంగా రాణించాడు. ఈసారి వెస్టిండీస్, అమెరికా ఆతిథ్యమిస్తున్న మెగా టోర్నీలో మరోసారి సత్తా చాటేందుకు ఈ లెఫ్ట్‌హ్యాండర్ ఆతృతగా ఎదురుచుస్తున్నాడు.