న్యూఢిల్లీ: రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్(Riyan Parag)కు ఫైన్ పడింది. మ్యాచ్ ఫీజులో అతనికి 25 శాతం కోత విధించారు. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్ సమయంలో.. రియాన్ పరాగ్ డ్రెస్సింగ్ రూమ్‌లో ఈ-సిగరేట్ తాగాడు. ఆ ఘటనకు చెందిన వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఎలక్ట్రానిక్ డివైస్‌తో పొగు పీల్చుతున్నట్లు కనిపించిన ఘటన పట్ల సోషల్ మీడియలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఆ ఘటనపై ఐపీఎల్ స్పందించింది. మ్యాచ్ ఫీజులో 25 శాతం ఫైన్ విధిస్తున్నట్లు ఐపీఎల్ తన ప్రకటనలో చెప్పింది.
పరాగ్ స్మోకింగ్ చేసిన విషయంపై ఆన్ ఫీల్డ్ అంపైర్లు తన్మే శ్రీవాత్సవ్, నితిన్ మీనన్ మ్యాచ్ రిఫరీ అమిత్ శర్మకు ఫిర్యాదు చేయలేదు. విజువల్స్ చూసిన తర్వాత వాళ్లు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత పరాగ్ క్రమశిక్షణా ఉల్లంఘనకు పాల్పడినట్లు శర్మ తెలిపారు. లెవల్1 అఫెన్స్ ప్రకారం మ్యాచ్ ఫీజులు 25 శాతం ఫైన్ విధించారు. ఓ డీమెరిట్ పాయింట్ కూడా పరాగ్ ఖాతాలో పడింది. తప్పుచేసినట్లు రియాన్ అంగీకరించాడు. మ్యాచ్ రిఫరీ విధించిన ఫైన్‌ను ఆమోదించినట్లు ఐపీఎల్ ఓ ప్రకటనలో చెప్పింది.
రాజస్థాన్ రాయల్స్ జట్టు, యాజమాన్యంపై తీవ్ర చర్యలు తీసుకోవాలన్న ఆలోచనలో బీసీసీఐ ఉన్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ ప్రతిష్టకు ఆర్ఆర్ జట్టు భంగం కలిగిస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ఆ జట్టుపై కఠిన చర్యలు తీసుకోవాలని బీసీసీఐ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. రాజస్థాన్ రాయల్స్ జట్టుపై చర్యలు తీసుకోవాలని భావిస్తున్నామని, కానీ ఎటువంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై ఇంకా క్లారిటీ లేదని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సాకియా తెలిపారు.
2019లోనే భారత ప్రభుత్వం ఈ-సిగరెట్లను బ్యాన్ చేసింది. చట్టం ప్రకారం ఆ సిగరెట్లు తాగిన వారికి ఏడాది జైలు శిక్ష లేదా లక్ష జరిమానా విధిస్తారు. పరాగ్‌పై ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.21 కింద చర్యలు తీసుకున్నట్లు బీసీసీఐ చెప్పింది. 2.21 కింద అన్ని రకాల ప్రవర్తనలు వస్తాయని ఆయన చెప్పారు. రాజస్థాన్ టీమ్ మేనేజర్ రోమీ బిందర్ ఓ మ్యాచ్‌లో డగౌట్లో మొబైల్ వాడిన విషయం తెలిసిందే. ఆ ఘటనలో అతనికి లక్ష జరిమానా వేశారు.