Rohit Sharma | ముంబై: ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్‌శర్మ కోసం ఢిల్లీ క్యాపిటల్స్, లక్నోసూపర్ జెయింట్స్ జట్లు 50 కోట్లు ఖర్చు చేసేందుకు సిద్ధం కాబోతున్నాయి. వచ్చే సీజన్ కోసం జరుగనున్న వేలం పాటలో రోహిత్‌ను దక్కించుకునేందుకు ఢిల్లీ, లక్నో పావులు కదుపుతున్నాయి. అయితే ముంబై జట్టును వీడే విషయంలో రోహిత్ తీసుకునే నిర్ణయం కోసం ఫ్రాంచైజీలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఒకవేళ ముంబై నుంచి తప్పుకోవాలని భావిస్తే.. కండ్లు చెదిరే రీతిలో హిట్‌మ్యాన్‌కు రికార్డు ధర పలికే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. టీ20 ప్రపంచకప్ సాధించడంలో రోహిత్ కీలకంగా వ్యవహరించాడు.