Rishabh Pant : టెస్టు స్పెషలిస్ట్‌గా ముద్రపడిన భారత వికెట్ కీపర్ రిషభ్ పంత్ (Rishabh Pant) వచ్చేస్తున్నాడు. ఈసారి అతడు ఆటగాడిగా కాదు కెప్టెన్‌గా మైదానంలోకి దిగనున్నాడు. అవును.. ఇంగ్లండ్ పర్యటనలో పాదం గాయంతో ఆటకు దూరమైన పంత్ కోలుకొని.. ఫిట్నెస్ సాధించాడు. స్వదేశంలో దక్షిణాఫ్రికా(South Africa)తో జరుగబోయే టెస్టు సిరీస్ సన్నద్ధత కోసం భారత ఏ జట్టు సారథిగా ఎంపికయ్యాడీ డాషింగ్ బ్యాటర్. సఫారీ ఏ జట్టుతో రెండు నాలుగు రోజుల మ్యాచ్‌కు పంత్ నేతృత్వం వహించనుండగా.. అతడికి డిప్యూటీగా యంగ్‌స్టర్ సాయి సుదర్శన్ వ్యవహరించనున్నాడు.
అక్టోబర్ చివరి వారంలో దక్షిణాఫ్రికా ఏ జట్టు రెండు నాలుగు రోజుల మ్యాచ్‌ల కోసం భారత పర్యటనకు రానుంది. దాంతో.. మంగళవారం సెలెక్టర్లు పంత్ సారథిగా పటిష్టమైన స్క్వాడ్‌ను ఎంపిక చేశారు. తొలి నాలుగు రోజుల మ్యాచ్‌కు జూనియర్ ఆటగాళ్లనే ఎంపిక చేసినా .. రెండో మ్యాచ్‌లో స్టార్ ఆటగాళ్లు బరిలోకి దిగనున్నారు.
🚨 𝑩𝑹𝑬𝑨𝑲𝑰𝑵𝑮 🚨
BCCI has announced the India A squad for the four-day matches against South Africa A, starting on 30th October! 🇮🇳🏏
Rishabh Pant will lead the side in both games. 🤝#RishabhPant #IndiaA #Cricket #Sportskeeda pic.twitter.com/NBF1hX9VfY
— Sportskeeda (@Sportskeeda) October 21, 2025
కేఎల్ రాహుల్, సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, అకాశ్ దీప్తో పాటు సీనియర్ పేసర్ ఖలీల్ అహ్మద్‌లు ఎంపికయ్యారు. బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో అక్టోబర్ 30 నుంచి నవంబర్ 2 వరకూ తొలి మ్యాచ్.. నంబర్ 6 నుంచి 9వ తేదీ వరకూ ఇదే మైదానంలో రెండో మ్యాచ్‌లో భారత ఏ, దక్షిణాఫ్రికా ఏ జట్లు తలపడనున్నాయి. నవంబర్‌లో దక్షిణాఫ్రికా సీనియర్ జట్టు మూడు ఫార్మాట్ల సిరీస్ కోసం భారత్‌కు రానుంది. నవంబర్ 14న ఈడెన్ గార్డెన్స్‌లో తొలి టెస్టు జరుగనుంది. టీమిండియాతో సఫారీ టీమ్ రెండు టెస్టులు, మూడు వన్డేలు, 5 టీ20లు ఆడనుంది.
తొలి నాలుగు రోజుల మ్యాచ్‌కు స్క్వాడ్ : రిషభ్ పంత్(కెప్టెన్, వికెట్ కీపర్), ఆయుష్ మాత్రే, ఎన్.జగదీశన్(వికెట్ కీపర్), సాయి సుదర్శన్(వైస్ కెప్టెన్), దేవ్‌దత్ పడిక్కల్, రజత్ పాటిదార్, హర్ష్ దుబే, తనుష్ కొతియాన్, మానవ్ సుతార్, అన్షుల్ కంభోజ్, యశ్ ఠాకూర్, ఆయుష్ బదొని, సరన్ష్ జైన్.
రెండో నాలుగు రోజుల మ్యాచ్‌కు స్క్వాడ్ : రిషభ్ పంత్(కెప్టెన్, వికెట్ కీపర్), కేఎల్ రాహుల్, ధ్రువ్ జురెల్(వికెట్ కీపర్), సాయి సుదర్శన్(వైస్ కెప్టెన్), దేవ్‌దత్ పడిక్కల్, రుతురాజ్ గైక్వాడ్, హర్ష్ దూబే, తనుష్ కొతియాన్, ఖలీల్ అహ్మద్, గుర్నూర్ బ్రార్, అభిమన్యు ఈశ్వరన్, ప్రసిధ్ కృష్ణ, సిరాజ్, ఆకాశ్ దీప్.
This is called Aura 💀
– Pant batting with a broken toe
– All fielders on the boundary
– Shameless Jofra still aiming at that injured toe
– Next ball, Sir Rishabh Rajendra Pant sends that BL@CK T@XI over the ropes for a six 🔥pic.twitter.com/2seFeGFKA5— Ishan Ghosh¹⁷🇮🇳 (INACTIVE) (@PantVerse) August 15, 2025